గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Jan 23, 2020 , 00:49:34

నాగోబాకు ‘సిరి’కుండలు..

నాగోబాకు ‘సిరి’కుండలు..
  • - మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు
  • - మర్రి చెట్ల కింద విశ్రాంతి
  • - సామూహిక వంటలు, సహపంక్తి భోజనాలు

ఇంద్రవెల్లి (ఆదిలాబాద్‌ జిల్లా): సిరికొండ నుంచి తెచ్చిన మట్టి కుండలు నాగోబా ఆలయానికి చేరుకున్నాయి. గోదావరి పవిత్ర గంగాజలంతో జనవరి 20న రాత్రి కెస్లాపూర్‌కు చేరుకున్న మెస్రం వంశీయులు మర్రిచెట్ల ప్రాంతంలో కుటుంబ సమేతంగా విశ్రాంతి తీసుకుంటున్నారు.  బుధవారం ఉదయన్నే మెస్రం వంశీయుల పెద్దలు, మహిళలు, పురుషులు కచేరి నిర్వహించారు. నాగోబా పూజలపై చర్చించారు. మహాపూజలకు ఉపయోగించే మట్టికుండలను ఐదు ఎడ్లబండ్లతో రాత్రి సిరికొండకు వెళ్లి నాగోబా ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయం వెనుకభాగంలో భద్రంగా ఉం చారు. మంగళవారం రా త్రి మర్రిచెట్ల వద్దకు చేరుకున్న మెస్రం వంశీయుల పటేళ్లకు స్వాగతం పలికారు. అనంతరం మర్రిచెట్ల ప్రాంతంలో నీటి కోనేరుతోపాటు గంగాజలం ఝరి భద్రపర్చిన ప్రాంతం లో ప్రత్యేక పూజలు చేశారు. నాగోబాకు మహాపూజలతోపాటు సంప్రదాయ పూజలపై చర్చించారు. సంప్రదాయ వాయిద్యాలు, కిక్రి వాయిస్తూ నాగోబా చరిత్రపై తుకోడోజీ మెస్రం వంశీయులకు పాటల ద్వారా అవగాహన కల్పించారు. నాగోబాకు 24న నిర్వహించే మహాపూజలతోపాటు పెద్దల పేరిట అర్ధరాత్రి నిర్వహించే తుమ్‌(కర్మకాండ)పై చర్చించారు. మర్రిచెట్ల నుంచి నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మెస్రం వంశీయులు కితల(వంతుల)వారీగా మహిళలు సామూహిక నైవేద్యాలు వండుతున్నారు. సహప్తంకి భోజనాలు చేస్తున్నారు. 
logo