బుధవారం 21 అక్టోబర్ 2020
Mancherial - Jan 23, 2020 , 00:48:53

నస్పూర్‌లో 62.05 % పోలింగ్‌

నస్పూర్‌లో 62.05 % పోలింగ్‌సీసీసీ నస్పూర్‌, శ్రీరాంపూర్‌ :  నస్పూర్‌లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ చెదుమొదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. నస్పూర్‌లో మొత్తం 25 వార్డులు ఉండగా, 62,670 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 92 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశా రు. 38,887ఓట్లు పోలయ్యాయి. 62.05 పోలింగ్‌ శాతం నమోదైంది. కొన్ని వార్డుల్లో 70శాతానికి పైగా పోలింగ్‌ నమోదు కాగా, మరికొన్ని వార్డుల్లో తక్కువగా నమోదైంది. తక్కువ శాతం పోలింగ్‌ నమోదవడంతో ఫలితాలపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. 


సమస్యాత్మక కేంద్రాల్లో భారీ బందోబస్తు 

 నస్పూర్‌లో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద అడిషనల్‌ డీసీపీ(అడ్మిన్‌) అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో సీఐలు కృష్ణకుమార్‌, బిల్ల కోటేశ్వర్‌, ఎస్‌ఐలు నిరంతరం బందోబస్తు చర్యలు చేపట్టారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల దగ్గరకు వచ్చే పార్టీల నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టారు. తాళ్లపల్లి, సింగాపూర్‌ విద్యుత్‌ అంతరాయం కలగడంతో కొంతసేపు లాంతర్లతో పోలింగ్‌ చేపట్టారు.  వృద్ధు లు, వికలాంగుల కోసం వీల్‌ చైర్లను, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. తీగల్‌పహాడ్‌ 19వ వార్డులో రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ పరిశీలించారు. ఓటర్లతో మాట్లాడారు. అనంతరం పోలీస్‌ అధికారులతో బందోబస్తుపై చర్చించి, వారికి పలు సలహాలు, సూచనలు చేశారు. నస్పూర్‌లోని పలు వార్డుల్లోని పోలింగ్‌ కేంద్రాలను మున్సిపల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అనురాధ సందర్శించారు. 
logo