గురువారం 29 అక్టోబర్ 2020
Mancherial - Jan 23, 2020 , 00:46:53

ఖాందేవ్‌ జాతర జనసంద్రం

ఖాందేవ్‌ జాతర జనసంద్రం
  • - భారీగా తరలివస్తున్న భక్తులు
  • - కిటకిటలాడుతున్న ఆలయ పరిసరాలు

నార్నూర్‌: పుష్యమాసం సందర్భంగా మండల కేంద్రంలో ప్రారంభమైన ఖాందేవ్‌ జాతర పన్నేండు రోజులుగా కొనగసాగుతున్నది. భారీగా భక్తులు తరలివస్తుండడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. బుధవారం ఉమ్మడి జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాల గిరిజనులు కుటుంబ సమేతంగా ఖాందేవ్‌ను దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధిలో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా జాతరలో ఆనందంగా గడిపారు. జాతరలో వెలిసిన దుకాణాల్లో చిన్నారులు ఆట వస్తువులు, తినుబండారాలు, మహిళలు వివిధ సామగ్రి కొనుగోలు చేశారు. జాతరలో ప్రత్యేకంగా లభించే జిలేబీని కొనుగోలు చేసి కుటుంబసమేతంగా తిన్నారు. ఈ జాతర నాగోబా మహాపూజ వరకు కొనసాగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.


జాతరలో.. జడ్పీ చైర్మన్‌, బోథ్‌ ఎమ్మెల్యే

ఖాందేవ్‌ జాతరలో జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు బుధవారం స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. జాతరలో ప్రత్యేకంగా తయారు చేసే జిలేబీ కొనుగోలు చేసి తిన్నారు. జాతర సందర్భంగా నిర్వహించిన కబడ్డీ క్రీడాకారుల ను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. గ్రామీణ యువకులు జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. అంతకుముందు మండల కేంద్రంలో నిర్వహించిన రాథోడ్‌ దేవ్‌జీబాయి పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై బాధితకుంటు బాన్ని పరామర్శించారు. స్థానిక వేంకటేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. వీరి వెంట సర్పంచులు బానోత్‌ గజానంద్‌నాయక్‌, రాథోడ్‌ యశ్వంత్‌రావ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ తొడసం నాగోరావ్‌, మాజీ ఎంపీటీసీలు ఆడె సురేశ్‌, బానోత్‌ జాలంసింగ్‌, మాల్కుపటేల్‌, లోకండే చంద్రశేఖ ర్‌, ఆడె దత్తు తదితరులు ఉన్నారు.