మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Jan 20, 2020 , 02:32:46

పోలియో రహిత జిల్లాగా మార్చాలి

పోలియో రహిత జిల్లాగా మార్చాలి
మంచిర్యాల అగ్రికల్చర్‌: పోలియో రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ భీష్మతో కలిసి పల్స్‌ పోలియోను ఆదివారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. చిన్నారుల తల్లిదండ్రులు విధిగా వారి పిల్లలకు చుక్కల మందు వేయించాలనీ, ఇది తమ బాధ్యతగా గుర్తించాలన్నారు. జిల్లాలో 76,519 మంది చిన్నారులున్నారనీ, వీరికి చుక్కలు వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 59 రూట్లలో 616 పోలింగ్‌ బూత్‌లు, 24 మొబైల్‌ టీమ్స్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రయాణికుల పిల్లలకు అందించేందుకు 25 ట్రాన్సిట్‌ పాయింట్ల ద్వారా రైల్వే స్టేషన్‌, బస్‌ స్టేషన్ల, ప్రత్యేక ప్రధాన చౌరస్తాలో చుక్కలు వేస్తున్నారన్నారు. ఈ రోజు తప్పిపోయిన వారుంటే  సోమ, మంగళవారాల్లో ఏఎన్‌ఎం, ఆశా, అంగన్‌ వాడీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరిగి చుక్కలు వేస్తారనీ, ఎవరినీ వదలరన్నారు. దవాఖాన ఆర్‌ఎంవో డాక్టర్‌ అనీల్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ ఫయాజ్‌ ఖాన్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ అల్లాడి శ్రీనివాస్‌, సబ్‌ యూనిట్‌ అధికారి గుండేటి నాం దేవ్‌, వైద్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
90 శాతం పూర్తి
జిల్లాలో 90 శాతం పూర్తయినట్లు డీఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ భీష్మ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 17 పీహెచ్‌సీలు, నాలుగు యూహెచ్‌సీలు, మూడు సీహెచ్‌సీల పరిధిలో ఐదేండ్ల లోపు వారు 75,587 మంది పిల్లలు పల్స్‌ పోలియో చుక్కలు వేయాల్సి ఉండగా సాయం త్రం వరకు మొదటి రోజు 68,121 (90 శాతం) మంది పిల్లలకు చుక్కలు వేశారన్నారు. 5500 వాయిల్స్‌లో 4541 వాయిల్స్‌ను ఉపయోగించారన్నారు. ఆయా పీహెచ్‌సీల పరిధిలో 66,272 మంది చిన్నారులకు చుక్కలు వేయ గా, ఔట్‌రీచ్‌ చిన్నారులు 40 మందికి, 25 ట్రా న్సిట్‌ పాయింట్ల ద్వారా 1720 మంది చిన్నారులు, మొబైల్‌ టీం ద్వారా 89 మంది చిన్నారులకు చుక్కలు వేశారు. 


logo