సోమవారం 19 అక్టోబర్ 2020
Mancherial - Jan 19, 2020 , 00:46:03

నాగోబాకు సౌకర్యాలు కల్పించాలి..

నాగోబాకు సౌకర్యాలు కల్పించాలి..
  • -జాతర ఏర్పాట్లపై నిర్లక్ష్యం చేయద్దు..
  • -20వ తేదీలోపు పనులు పూర్తి చేయాలి
  • -పది రోజులు ముత్నూర్‌లోని మద్య దుకాణం బంద్‌ చేయాలి..
  • -24వ తేదీన నాగోబాకు మహాపూజలు.. 27వ తేదీన ప్రజాదర్బార్‌
  • -సమీక్ష సమావేశంలో ఆదిలాబాద్‌ కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌
  • -నాగోబాను దర్శించుకుని కలెక్టర్‌,ఎస్పీ ప్రత్యేక పూజలు

ఇంద్రవెల్లి : నాగోబా జాతరకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ అన్నా రు. శనివారం మండలంలోని కెస్లాపూర్‌ నాగోబా దర్బార్‌హాల్‌లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖలకు చెందిన అధికారులకు జాతరలో చేపట్టే ఏర్పాట్లతోపాటు వివిధ పనుల బా ధ్యతలు ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ శాఖల వారీగా కేటాయించిన పనునల్నీ రేపటిలోగా పూర్తి  చేయాలని ఆదేశించారు. ఈ నెల 24న మెస్రం వంశీయులు మహాపూజలు 27 న ప్రజా దర్బారు ఉంటుందన్నారు. జాతర ముగిసే వరకు నిరంతరం పారిశుధ్య పనులతో పాటు వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవలు అందుబాటులో ఉంచాలన్నారు.

అన్ని రూట్లకు బస్సులను నడిపించాలని సూచించారు. నాణ్యమైన వస్తువు లు విక్రయించేలా దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. తాగునీటికి ఇబ్బందుల్లేకుండా నీటి ట్యాంకులను శుభ్రం చేసి నింపాలని సూచించా రు. పశుసంవర్ధక శాఖ అధికారులు మెస్రం వంశీయుల పశువులకు దానాను అందించాలని, ఆదేశించారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు పోషకాహారాన్ని అందించాలన్నారు. ఈ నెల 20 నుంచి 30 వరకు ముత్నూర్‌ గ్రామంలోని మద్యదుకాణం, మూసివేయించాలనీ, చుట్టుపక్కలా గ్రామాల్లో మద్యం లేకుండా సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్‌ సమస్యరాకుండా ప్రత్యేక జనరేటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం అధికారుల తో కలిసి నాగోబా జాతరకు చెందిన పోస్టర్‌ను విడుదల చేశారు. అంతుకుముందు ఆమె  నాగోబాను దర్శించుకోని ప్రత్యేక పూజలు చేశారు.

బందోబస్తుతోపాటు ప్రత్యేక నిఘా: ఎస్పీ విష్ణువారియర్‌

నాగోబా జాతరకు భారీ బందోబస్తుతో పాటు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ విష్ణువారియర్‌ సూచించారు. కెస్లాపూర్‌ చుట్టు పక్కలా గ్రామాల్లో  బెల్టు షాపులు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రద్ధీ ప్రాంతంలో 21 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పర్యవేక్షించాలనీ, అన్ని శాఖలకు చెందిన అధికారులకు ప్రత్యేకంగా కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేయాలని  సూచించారు. అన్ని నెట్‌వర్క్‌ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముత్నూర్‌ నుంచి కెస్లాపూర్‌ వరకు ట్రాఫిక్‌ సమస్య రాకుండా వన్‌వే ఏర్పాటు చేయాలన్నారు. ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖ సమన్వయంతో చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. మహిళలకు రక్షణకు షీ టీంలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ శబరీష్‌, శిక్షణ ఐపీఎస్‌ హర్షవర్ధన్‌ శ్రీవాస్తవ్‌, ఆర్డీవో వినోద్‌కుమార్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాయిసిడాం చిత్రు, తాసిల్దార్‌ రాఘవేంద్రరావ్‌, ఎంపీడీవో రమాకాంత్‌, ఎస్‌బీ ఎస్‌ఐ మెస్రం చంద్రభాన్‌, స్థానిక సర్పంచ్‌ మెస్రం రేణుకనాగ్‌నాథ్‌, ఆలయ ఈవో మహేశ్‌, మెస్రం వంశీయులు పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్‌పటేల్‌, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌ మెస్రం మనోహర్‌, డీడీ చందన, ఐటీడీఏ మేనేజర్‌ రామ్‌బాబు, సీఐ నరేష్‌, ఎస్‌ఐ గంగారామ్‌, ఆయా శాఖలకు చెందిన అధికారులు, మెస్రం వంశీయులు దేవ్‌రావ్‌, సోనేరావ్‌, నాగ్‌నాథ్‌, తుకారామ్‌, బాధిరావ్‌, దుర్గు, తదితరులు పాల్గొన్నారు.


logo