మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Jan 16, 2020 , 23:31:41

ప్రచార యుద్ధం

ప్రచార యుద్ధం


మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నేతలు, అభ్యర్థుల విస్తృత క్యాంపెయిన్ జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ప్రచారం పర్వం జోరందుకుంది. మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టికెట్లు రాక ముందే గులాబీ నేతలు అందరిని ఒకసారి కలిసి వచ్చారు. టికెట్ రావడంతో ఇంటింటికి తిరుగుతూ తమకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. అభ్యర్థులతోపాటు ద్వితీయ శ్రేణి నాయకులు అదే స్థాయిలో ప్రచారం సాగిస్తున్నారు. పార్టీ అభ్యర్థులు ఒకవైపు, నేతలు మరోవైపు ప్రచారం చేస్తూ జనంలోకి దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలో తడబడుతున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థులను టీఆర్ చేర్చుకునేందుకు ఎమ్మెల్యే బాల్క సుమన్ దూకుడు ప్రదర్శించడంతో మిగతా పార్టీలు బెంబేలెత్తుతున్నాయి. గురువారం చెన్నూర్ బల్దియాలో ప్రభుత్వ విప్ సుమన్, ఎమ్మెల్సీలు పురాణం, నారదాసు.. మంచిర్యాల మున్సిపాలిటీలో ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే దివాకర్ బెల్లంపల్లి బల్దియాలో ఎమ్మెల్యే చిన్నయ్య అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.                 

జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న ఆరు మున్సిపాలిటీల్లో టీఆర్ ప్రచారం జోరందుకుంది. అంతకుముందే ఆ పార్టీ తరఫున ఎమ్యెల్యేలు ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఒక దఫా ఎన్నికల ప్రచారం ముగించిన ఎమ్మెల్యేలు మరోసారి ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ ఇంటింటికీ టీఆర్ పేరిట లక్షెట్టిపేట, నస్పూరు, మంచిర్యాల మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించారు. బాల్క సుమన్ అభివృద్ధి మంత్రంతో పలు ప్రారంభోత్సవాలు చేసి టీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో అభివృద్ధి పనులు ఆగకూడదంటే కచ్చితంగా ఆ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకత చాటి చెప్పారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి పట్టణంలో చేసిన అభివృద్ధి పనులు చేస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా పార్టీ టిక్కెట్ వచ్చిన అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగిస్తున్నారు. ఒకవైపు అభ్యర్థులు ప్రచారం సాగిస్తుండగా మరోవైపు ద్వితీయ శ్రేణి నేతలు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు.

నేరుగా అభ్యర్థులకే ఎసరు..

ఎన్నికల్లో చాణక్య నీతిని ప్రదర్శించే ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఏకంగా ఇతర పార్టీల అభ్యర్థులకే ఎసరు పెడుతున్నారు. సాధ్యమైనంత వరకు చెన్నూరు మున్సిపాలిటీలో ఏకగ్రీవం చేయించిన ఆయన ఇతర పార్టీల అభ్యర్థులను పోటీలో లేకుండా ముందుకు సాగుతున్నారు. చెన్నూరులో ఏడు స్థానాలను ఏకగ్రీవం చేయడంలో సుమన్ కీలకపాత్ర పోషించారు. అదే సమయంలో మిగతా పార్టీల అభ్యర్థులను బరిలో లేకుండా టీఆర్ మద్దతు పలికేలా ప్రణాళికలు రూపొందించారు. దీనిలో భాగంగా చెన్నూరు 17 వార్డు బీజేపీ అభ్యర్థి తనుగుల సరోజన టీఆర్ చేరారు. ఆమె ఆ వార్డు టీఆర్ అభ్యర్థికి నాయిని శ్యామలకు మద్దతు పలుకుతున్నట్లు వెల్లడించారు. ఇక చెన్నూరు, క్యాతన్ దాదాపు పది మంది వరకు ఇతర పార్టీల అభ్యర్థుల మీద కన్నేసిన టీఆర్ నేతలు తమ వారికి మద్దతు పలికేలా పావులు కదుపుతున్నారు. దీంతో ప్రచారం సంగతి దేముడెరుగు... తమ పార్టీ అభ్యర్థులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ముఖ్యంగా బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోటీలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

తడబడుతున్న కాంగ్రెస్, బీజేపీ..

ప్రచారం విషయంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు తడబడుతున్నాయి.
అభివృద్ధి,  అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి చెబుతూ టీఆర్ అభ్యర్థులు ముందుకు సాగుతుండగా వీరు ప్రచారం చేసేందుకు ప్రత్యేకంగా అంశాలు ఏవీ దొరకడం లేదు. దీంతో వారు ప్రచారంలో వెనకబడుతున్నారు. స్థానిక అంశాలు, ప్రభుత్వంపై బురద చల్లడం తప్ప వేరే ప్రచారాంశాలుగా ప్రత్యేక అంశాలు ఏవీ లేవని పలువురు చెబుతున్నారు. బెల్లంపల్లి, క్యాతన్ మంచిర్యాల రోడ్ పాల్గొన్న బీజేపీ నేత కిషన్ రెడ్డి కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. దీంతో ఆ పార్టీ అభ్యర్థులకు ఓట్ల మాట దేముడెరుగు... డిపాజిట్లు దక్కే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఇక  కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద నేత ఎవరూ లేకపోవడంతో ఆయా మున్సిపాలిటీల్లో ప్రచారం బోసిపోతోంది. ఎక్కడికక్కడ నేతలు, కార్యకర్తలు ప్రచారం చేసుకుంటున్నారు. టీఆర్ దాటికి తట్టుకుని తాము గెలిచే పరిస్థితి లేదని చాలా చోట్ల ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు చెబుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.logo