సోమవారం 19 అక్టోబర్ 2020
Mancherial - Jan 16, 2020 , 23:31:05

పోలియో రహిత సమాజం కోసం కృషి

పోలియో రహిత సమాజం కోసం కృషి


మంచిర్యాల రూరల్ : పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జేసీ వై సురేందర్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక్కడ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి 21వరకు నిర్వహించే పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నా రు. జిల్లాలో 2,392 నివాసాలుండగా ఐదేళ్ల లోపు వయస్సున్న పిల్లలు 75,587 మంది ఉన్నారనీ, 59 రూట్లలో 616 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటుచేయడంతో పాటు 5,163మంది సిబ్బందిని నియమించామని చెప్పారు. మొదటిరోజు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, దవాఖాన్లతో పాటు రద్దీ ప్రాం తాల్లో పోలియో చుక్కలను వేయనున్నట్లు తెలిపా రు. రెండవ, మూడవ రోజుల్లో ఆశా వర్కర్లు, ఏఎన్ అంగన్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని పేర్కొన్నారు. స్వయం సహాయక బృందాలు, మెప్మా సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. 100శాతం పోలియో చుక్కలను వేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్వంలో అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమ వసతిగృహాలతోపాటు అవసరమైన ప్రాం తాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేయాలని సూచించారు. పీహెచ్ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. అనంతరం పల్స్ పోలి యో పోస్టర్ విడుదల చేశారు. ఈ సమావేశంలో బెల్లంపలి సబ్ రాహుల్ డీసీపీ ఉదయ్ ప్రత్యేక అధికారి స్నేహలత, అసిస్టెంట్ కలెక్టర్ కుమార్ ఆర్డీఓ కుతాటి శ్రీనివాస్, వైద్యా ధికారులు, తాసిల్దార్లు పాల్గొన్నారు.logo