శుక్రవారం 23 అక్టోబర్ 2020
Mancherial - Jan 16, 2020 , 23:30:31

కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు

కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు


కోటపల్లి : గ్రామాల్లో కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జైపూర్ ఏసీపీ నరేందర్ పేర్కొన్నారు. కోటపల్లి మండలంలోని ఆలుగామ, పుల్లగామ, వెంచపల్లి, సూపాక. జనగామ, నందరాంపల్లి గ్రామాల సమీపంలో సంక్రాంతి పండగ సందర్భంగా కోడి పందులు నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను పట్టుకున్నారు. కోటపల్లి పోలీస్ మంగళవారం వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కోడి పందేలు, జూదాల పేరిట సమయాన్ని వృథా చేసుకొని భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచించారు. పండుగ సమయంలో కుటుంబసభ్యులతో ఉండి ఆనందంగా గడపకుం డా కోడి పందేలు నిర్వహించడం సరైంది కాదని పేర్కొన్నారు. ఇక నుంచి కోడి పందేలలో పాల్గొన్న, పోటీలను నిర్వహించిన కేసులు నమోదు చేస్తామని హెచ్చిరించారు. కోడి పందేలతోపాటు పేకాట, జూ దం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలనీ, చట్టవ్యతిరేక కార్యకలపాలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సీఐ కోటేశ్వర్, కోటపల్లి ఎస్ రవి కుమార్, ఏఎస్ నసీర్ పాల్గొన్నారు.

కోడి పందేల స్థావరాలపై దాడులు

కోటపల్లి మండలంలోని ఆలుగామ, పుల్లగామ గ్రామాలలోని కోడి పందేల స్థావరాలపై కోటపల్లి ఎస్ రవి కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడు లు నిర్వహించారు. కోడి పందేలు నిర్వహిస్తున్న సుమారుగా 30మంది పందెంరాయుళ్లపై కేసులు నమోదు చేయడంతోపాటు 3 కోళ్లు, రూ.1300 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సం క్రాంతి పండగ సందర్బంగా కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో దాడులు చేసి పందెం రాయుళ్లను పట్టుకున్నట్లు ఎస్ వివరించారు.


logo