సోమవారం 26 అక్టోబర్ 2020
Mancherial - Jan 14, 2020 , 01:04:45

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి


దండేపల్లి : సమస్యల పరిష్కారానికే  ప్రజావాణి కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నట్లు మండల ప్రత్యేకాధికారి ప్రకాశ్‌ పేర్కొన్నారు. సోమవారం దండేపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో పేదల సమస్యలు తీర్చాలని అర్జీలు ఇస్తుంటారనీ, వాటిని పెండింగ్‌లో ఉంచకుండా సమస్య తీర్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్‌, తాసిల్దార్‌ సంతోష్‌కుమార్‌,  వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


logo