శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mancherial - Jan 14, 2020 , 01:03:22

ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు

ఆకట్టుకున్న ముగ్గుల పోటీలు


సీసీసీ నస్పూర్‌ :  సంక్రాంతి సందర్భంగా ఓ కేబుల్‌ నెట్‌వర్క్‌ సంస్థ ఆధ్వర్యంలో సీసీసీ టౌన్‌షిప్‌లోని సింగరేణి మైదానంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ప్రాంత మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అవనిపై అందమైన ముగ్గులను అలంకరించి ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో రామక్రిష్ణాపూర్‌కు చెందిన రుద్రమాదేవి(ప్రథమ), గోదావరికాలనీ(షిర్కె)కు చెందిన స్వప్న(ద్వితీయ), రామక్రిష్ణాపూర్‌కు చెందిన లక్ష్మీప్రసన్న(తృతీయ) విజయం సాధించారు. ప్రథమ బహుమతి రూ.5వేలు, ద్వితీయ బహుమతి రూ.3వేలు,  తృతయ బహుమతి రూ.2వేలను బట్టల వ్యాపారవేత్త, టీఆర్‌ఎస్‌ నాయకుడు పత్తి గట్టయ్య అందించారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారందరికి అర్చనటెక్స్‌ అధినేత గురిజాల రాధాకిషన్‌రావు, శ్రీరాంపూర్‌ సేవా అధ్యక్షురాలు సరళాదేవి, బ్రైటే వే డైరెక్టర్‌ మహ్మద్‌ మౌలానాలతో కలిసి చీరలను అందజేశారు. వంటనూనెను నిర్వాహకురాలు వైశాలి విజేతలకు ఒక్కో లీటరు చొప్పున బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహిళల కోసం ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ పోటీలకు నారాయణరావు వ్యాఖ్యాతగా, పార్వతి, హేమలత, కొట్టె జ్యోతి, విజయలక్ష్మి న్యాయ నిర్ధేతలుగా వ్యవహరించారు.