మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Jan 14, 2020 , 01:01:12

మున్నూరు కాపులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

మున్నూరు కాపులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి


శ్రీరాంపూర్‌ : తెలంగాణలో అత్యధికంగా ఉన్న మున్నూరు కాపులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, రుణాలందించాలని ప్రభుత్వాన్ని తెలంగాణా మున్నూరు కాపు సంఘం పటేల్స్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బోరిగం రాజారాం కోరారు.  సోమవారం నస్పూర్‌ కాలనీలోని ప్రెస్‌క్లబ్‌ హాల్లో మంచిర్యాల, నస్పూర్‌ మండలాల మున్నూరు కాపు కులస్థుల సర్వసభ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా స్థాయి మున్నూరు కాపు సంఘం 2020 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బోరిగం రాజారాం, మున్నూరు కాపు యూత్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి సురేశ్‌కుమార్‌ మాట్లాడారు. మున్నూరు కాపులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, రూ.5 వేల కోట్లతో వెనకబడిన వారికి రుణాలు అందించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. అన్ని పార్టీలు మున్నూరు కాపు కులస్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మున్నూరు కాపులు రాజకీయంగా వెనకంజలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణాలో బీసీలు రాజకీయ చైతన్యం, ఐక్యతతో సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. కులస్థులంతా ఐక్యంగా ఉండాలని పిలు పునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి భాస్కరి రాజేశం, నాయకులు పెద్దపల్లి కోటిలింగం, రెడ్‌క్రాస్‌ సొసైటీ కోశాధికారి పడాల రవీందర్‌, దెబ్బంటి రామన్న, పానగంటి సత్తయ్య, అడె మధూకర్‌, నీలం సదయ్య, ఆకుల లక్షణ్‌, తోట రాములు తదితరులు పాల్గొన్నారు.


logo