గురువారం 04 జూన్ 2020
Mancherial - Jan 13, 2020 , 02:12:46

కలసికట్టుగా బాగుచేసుకుందాం..

కలసికట్టుగా బాగుచేసుకుందాం..కలసికట్టుగా తమ గ్రామాలను బాగుచేసుకుందామని ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమం ఆదివారం ముగియడంతో జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని భీమినిలో సభలో బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పాల్గొన్నారు. పనుల వివరాలను పరిశీలించి సూచనలు చేశారు. నిర్లక్ష్యం చేసిన అధికారులను మందలించారు. కొన్ని చోట్ల సస్పెండ్‌ చేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో పర్యటించి సూచనలు చేశా రు. చెన్నూర్‌, మంచిర్యాలలోని గ్రామాల్లో కూడా చివరి రోజు గ్రామసభలు, సమావేశాలు నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని ఇప్పటి వరకు చేపట్టిన, చేపట్టాల్సిన పనుల వివరాలు పరిశీలించా రు. మరి కొన్ని పనులపై తీర్మానాలు చేశారు. అధికారులకు ప్రజా ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులకు ఉన్నతాధికారులు సన్మానం చేసి అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ పల్లెలను అందంగా తీర్చిదిద్దుదామని ప్రతిజ్ఞలు చేశారు.


logo