ఆదివారం 25 అక్టోబర్ 2020
Mancherial - Jan 12, 2020 , 02:55:00

ఊరూరా ‘ప్రగతి’ పరుగులు

ఊరూరా ‘ప్రగతి’ పరుగులు
  • -పదో రోజూ జోరుగా పనులు
  • -ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలు
  • -కంపోస్ట్‌ షెడ్లు, డంప్‌యార్డు నిర్మాణాలకు భూమిపూజ
  • -కోటపల్లి మండలంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ స్నేహలత పర్యటన
  • -నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

‘పల్లె ప్రగతి’ ఊరూరా ఉత్సాహంగా సాగుతుండగా, పండుగ వాతావరణం కనిపిస్తున్నది. ప్రజలు కలిసికట్టుగా అభివృద్ధిలో పా లు పంచుకుంటుండగా, అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామువుతున్నారు. పారిశుధ్య ప నులు చేపట్టడంతో పాటు సమస్యలు గుర్తించి అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తున్నారు. శనివారం పదో రోజు జోరుగా కార్యక్రమాలు నిర్వహించారు. కోటపల్లి మండల కేంద్రంతో పాటు పంగిడి సోమారం, అన్నా రం, గ్రామాల్లో అసిస్టెంట్‌ కలెక్టర్‌ స్నేహలత పర్యటించి పనులపై అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు. బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌, అసిస్టెంట్‌ ట్రెయినీ కలెక్టర్‌ దీపక్‌ కుమార్‌తో కలిసి భీమిని మండలంలోని రాంపూర్‌, మల్లీడి,  రాజారం, భీమిని, వడాల, అక్కల్లపల్లి, కేస్లాపూర్‌ గ్రామాల్లో పనులను పరిశీలించారు. ఇంకుడుగుంతల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అసిస్టెంట్‌ ట్రెయినీ కలెక్టర్‌ దీపక్‌ కు మార్‌ పాఠశాలలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజన నిర్వహన విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్య లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పలు గ్రామాల్లో శ్మశాన వాటికలు, డంప్‌ యార్డ్‌ల నిర్మాణానికి భూమి పూజలు నిర్వ హించారు. రోడ్డుకిరువైపులా పిచ్చి మొ క్కలను తొలగించి శుభ్రం చేశారు. ప్లాస్టిక్‌తో కలిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తూ, వాడకా న్ని పూర్తిగా నిషేధించాలని సూచించారు.


logo