బుధవారం 28 అక్టోబర్ 2020
Mancherial - Jan 12, 2020 , 03:02:57

డంపింగ్‌యార్డుకు భూమిపూజ

డంపింగ్‌యార్డుకు భూమిపూజ


జన్నారం :  మండలంలోని తిమ్మాపూర్‌లో డంపింగ్‌ యార్డు ఏర్పాటు సర్పంచ్‌ జాడి గంగాధర్‌ భూమిపూజ చేశారు. ఉపాధిహామీ ద్వారా డంపింగ్‌యార్డును నిర్మాణానికి ఏపీఓ రవీందర్‌ ఆధ్వర్యంలో ముగ్గు పోసి పనులను ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి లావణ్య, ఉపాధిహామీ సిబ్బంది, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
మంచిర్యాల రూరల్‌ : హాజీపూర్‌ మండలంలో నంనూర్‌, కర్నమామిడి, దొనబండ, గుడిపేట, రాపల్లి, హాజీపూర్‌, నర్సింగాపూర్‌, ముల్కల్ల, టీకన్నపల్లె, రాజేశ్వర్‌రావు పల్లె లో అభివృద్ధి పనులు చేశారు. ఈ పనుల్లో ఇంకుడు గుంతల నిర్మాణానికి ముగ్గు పోశారు. గుడిపేటలో ప్లాస్టిక్‌ కవర్లను సేకరించారు. కర్ణమామిడిలో పారిశుధ్య పనులను నిర్వహించారు. దొనబండ గ్రామంలో మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన మిమ్స్‌ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్‌సీసీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో శ్రమదానం చేసి పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు తదితరులున్నారు.


logo