మంగళవారం 20 అక్టోబర్ 2020
Mancherial - Jan 12, 2020 , 02:58:27

ఉత్సాహంగా ‘పల్లెప్రగతి’

ఉత్సాహంగా ‘పల్లెప్రగతి’


కోటపల్లి : కోటపల్లి మండలంలో పల్లె ప్రగతి ఉత్సాహంగా సాగుతోంది. మండలంలో చేపట్టిన పనులను అసిస్టెంట్‌ కలెక్టర్‌ స్నేహలత శనివారం పరిశీలించారు. పంగిడిసోమారంలో డంపింగ్‌ యార్డు నిర్మాణ పనులను ఎంపీడీఓ రమేశ్‌, ఎంపీఓ రవీంద్రనా థ్‌, సర్పం చ్‌ తులసీ, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ ప్రారంభించారు. కోటపల్లిలో స్పెషల్‌ ఆఫీసర్‌ జ్యోతి, సర్పంచ్‌ రాగం రాజక్క, పంచాయతీ కార్యదర్శి రవళి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. మల్లంపేట, షట్‌పల్లి, కొండంపేట, పుల్లగామ, లింగన్నపేట, దేవులవాడ, వెల్మపల్లి, సిర్సా, పిన్నారం తదితర గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ఇంకుడు గుంతలను నిర్మించుకోని వారికి విద్యుత్‌ కనెక్షన్‌ నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో రమేశ్‌, రవీంద్రనాథ్‌, వైష్ణవి, అనూష, రైస్‌ అహ్మ ద్‌, సంపత్‌, సర్పంచ్‌లు అక్కల మధూకర్‌, సుమలత, శంకర్‌, రాజు, పానెం శంకర్‌, సతీశ్‌, పంచాయతీ కార్యదర్శులు సుధాకర్‌రెడ్డి, శిల్ప, శంకర్‌, విజయ మానస, శైలజ, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.


logo