గురువారం 04 జూన్ 2020
Mancherial - Jan 12, 2020 , 02:57:18

టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ నేతలు

టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ నేతలు


చెన్నూర్‌, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ సమక్షంలో పలువురు బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. చెన్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విప్‌ సుమన్‌ శుక్రవారం రాత్రి బీజేపీ సీనియర్‌ నాయకులు బల్ల పోచన్న, బొమ్మ మల్లారెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేడ స్రవంతిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండ ల అధ్యక్షుడు మల్లెల దామోదర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి, రైతు సమన్వయ సమితి మం డల కన్వీనర్‌ రత్న సమ్మిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు రమేశ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


logo