గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Jan 10, 2020 , 12:01:25

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రోడ్డు ప్ర మాదాల నివారణకు రోడ్డు భద్రత కమిటీలో ఉన్న ప్రభుత్వ శాఖలన్ని సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శశాంక సూచించారు. కరీంనగర్, రామగుండం, సిద్దిపేట కమిషనరేట్లకు చెందిన రోడ్డు భద్రత కమిటీ సమావేశం గురువారం పోలీ స్ కమిషనరేట్‌లో జరిగింది. కలెక్టర్ శశాంక హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెచ్ కేఆర్, ఎన్‌హెచ్ రోడ్లకు చెందిన అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుందన్నారు. రోడ్లపై ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే సమాచారం అందించేందుకు హెచ్‌కేఆర్ సంస్థ నాలుగు డిజిట్ల నెంబర్‌ను ఏర్పా టు చేసి ప్రజలకు తెలిసేలా బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఒప్పందం ప్రకారం ఎన్ని సైన్‌బోర్డులను ఏర్పాటు చేయాలె, ఇప్పటి వరకు ఎన్ని ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ప్రమాదాలు జరిగిన ప్రాంతంలో తీసుకున్న జాగ్రత్త చర్యలను సమావేశంలో తెలియజేయాలన్నారు. ప్రతినెలా నాల్గో శనివారం రోడ్డు భద్రత కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. హెచ్‌కెఆర్, ఎన్‌హెచ్ రోడ్లకు చెందిన ఉన్నతాధికారులు సమావేశానికి హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమిళనాడు తరహా చర్యలు తీసుకోవాలి..
సీపీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు సరైన చర్యలు తీసుకున్నట్లయితే ప్రమాదాల శాతాన్ని తగ్గించవచ్చన్నారు. తమిళనాడు ప్రభుత్వం పటిష్టమైన చర్యలను తీసుకుని ఆ రాష్ట్రంలో 34 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గించిందన్నారు. తెలంగాణకు చెందిన అధికారులు తమిళనాడుకు వెళ్లి అక్కడ తీసుకున్న చర్యలను ప రిశీలించి వచ్చారని, మన రాష్ట్రంలో కూడా అ లాంటి తరహా చర్యలు తీసుకోనున్నారని తెలిపా రు. నడుస్తున్న వివిధ రకాల వాహనాలు, ప్రమాదాలు జరుగుతున్న తీరు తెన్నులపై పవర్‌పాయిం ట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకున్నామని, ఆ ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేశామన్నారు. స్పీడ్‌గన్‌ల వినియోగం ద్వారా హైవే రోడ్లపై వాహనాల వేగాన్ని నియంత్రిస్తున్నామని తెలిపారు. మూల మలుపులు, రోడ్లకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లను తొలగించాలని ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర రహదారులు కలిసే ప్రాంతమైన అల్గునూర్ వద్ద ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. జా తీయ, రాష్ట్ర రహదారులపై బెల్టుషాపులు నడపకుండా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను కోరారు. రామగుండం సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ రోడ్డు భద్రత కమిటీలోని ప్ర భుత్వ శాఖలు రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే నష్టాలను వివరించడంతో పాటు ప్రమాదాలు జరగకుండా తీసుకునే జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకునే చర్యలపై ఉన్నతాధికారులకు ఉన్నత శ్రద్ద కిందిస్థాయి అధికారుల్లో లేకపోవడం వల్ల ప్రమాదాలు నివారించలేకపోతున్నామన్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎస్ ఈ రాఘవచారి, ఈఈ వెంకటరమణ, జిల్లా గ్రా మీణాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వర్‌రావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఏడీ వెంకటేశం, ఆర్డీఓ ఆనంద్‌కుమార్, అడిషనల్ డీసీపీ చంద్రమోహన్, ఎసీపీలు అశోక్, విజయసారథి, శ్రీనివాసరావు, శంకర్‌రాజులతో పా టు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారు లు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


logo