e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home జిల్లాలు గుల్లకోట.. ప్రగతి

గుల్లకోట.. ప్రగతి

గుల్లకోట.. ప్రగతి

చివరి మజిలీ చింతతీర్చిన వైకుంఠధామం
అందుబాటులోకి డంప్‌యార్డు, రైతువేదిక
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధతో వాడలకు కళ
రాత్రిపూట జిగేల్‌మంటున్న వీధి దీపాలు
ఆహ్లాదం పంచుతున్న ప్రకృతి వనం

మంచిర్యాల, జూలై 19, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం చేపడుతున్న పల్లె ప్రగతితో గుడిపేట గ్రామ స్వరూపమే మారిపోయింది. ప్రజల జీవన విధానంలో పెనుమార్పు వచ్చింది.పల్లె ప్రకృతి వనం ఔషధ నిలయంగా మారింది. వైకుంఠధామం పూర్తవడంతో ఆఖరి మజిలీ చింత తీరింది. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో వాడలన్నీ అద్దంలా మెరుస్తున్నాయి. విద్యుత్‌ దీపాల వెలుగులో కాలనీలు కళకళలాడుతున్నాయి.

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం గుల్లకోట.. 1962లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. మొత్తం జనాభా 2,358, కాగా, 1,163 మంది స్త్రీలు, 1,195 మంది పురుషులు ఉన్నారు. 521నివాస గృహాలు కాగా, 1,020 కుటుంబాలు జీవిస్తున్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా 510 మరుగుదొడ్లు, 300 వ్యక్తిగత ఇంకుడు గుంతలను నిర్మించారు. గ్రామంలో వన నర్సరీ ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. హరితహారంలో భాగంగా 2500 మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. వాటిలో 92 శాతం బతికి ఉన్నాయి. కాలనీల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు. పరిశుభ్రతే లక్ష్యంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం అహర్నిశలు కృషిచేస్తున్నది. ట్రాక్టర్‌ సహాయంతో ప్రతి రోజూ ఇంటి నుంచి తడి,పొడి చెత్తను పారిశుధ్య సిబ్బంది తరలిస్తున్నారు. ఐదుగురు పారిశుధ్య కార్మికులున్నా రు. వారికి ఏడాదికి జీతంగా రూ.5 లక్షల 10 వేలు చెల్లిస్తున్నారు. ట్రాక్ట ర్లు, ఇతర వాటికి ఏడాదికి రూ.95 వేల కిస్తు (వాయిదా) చెల్లిస్తున్నారు. చెత్త సేకరణకు రెండు సైకిల్‌ రిక్షా బండ్లు ఉన్నాయి. తడి, పొడి చెత్త సేకరణ కోసం 1,042 బుట్టలు పంపిణీ చేశారు. జనాభా ప్రాతిపదికన గ్రా మానికి ఏడాదికి రూ.35 లక్షల నిధులు వస్తుండగా, ఇందులో పది శా తం గ్రీనరీకి కేటాయించారు. రూ.12 లక్షలతో శ్మశాన వాటికను నిర్మించారు. దహన వాటికలు, నీర్లు, స్నానాలకు, బట్టలు మార్చుకునేందుకు మహిళలు, పురుషులకు వేర్వేరుగా గదులు ఏర్పాటు చేశా రు. రైతు వేదికలు గ్రామస్తులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విత్తనాలు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భూసార పరీక్షలు, ఆధునిక వ్యవసాయ పరికరాల వినియోగం, ఇతర పంటల సమస్యలపై చర్చించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. గ్రామంలో కొత్తగా మట్టి రోడ్లతో పాటు రెండు సీసీ రోడ్లను నిర్మించారు. రోజూ పారిశుధ్య సిబ్బంది ఊడుస్తుండడం, మురుగుకాలువలను శుభ్రం చేస్తుండడం, చెత్తను సేకరిస్తుండడంతో రోడ్లన్నీ అద్దంలా మెరుస్తున్నాయి. చెత్తను వేరు చేసే సెగ్రిగేషన్‌ (కంపోస్టు) షెడ్డును నిర్మించారు. పారిశుధ్యంలో భాగంగా గ్రామంలో రెండు పాడుబడ్డ భవనాలను కూల్చివేశారు.

- Advertisement -

జిగేల్‌మంటున్న వీధి లైట్లు..
ప్రభుత్వ సహకారం, గ్రామస్తుల భాగస్వామ్యంతో గుల్లకోట గ్రామం పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. 210 వీధి దీపాలు ఉండగా, విద్యుత్‌ వెలుగుల్లో పల్లె జిగేల్‌ మంటున్నది. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో కొత్తగా 12 విద్యుత్‌ స్తంభాలు వేశారు. విరిగిపోయిన, వంగిన స్తంభాలను తొలగించారు. విద్యుత్‌ లూజ్‌ లేన్లను సరిచేశారు. 8 వేల మీటర్ల థర్డ్‌ లేన్‌ వైరును బిగించారు. ఊరిలో 230 ఎల్‌ఈడీ బల్బులను అమర్చారు. రాత్రిపూట విద్యుద్దీపాల వెలుగులు పగటిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం అవసరాల నిమిత్తం యథేచ్ఛగా రాత్రిపూట బయటకు వెళ్తున్నారు. సెంట్రల్‌ లైటింగ్‌ ఆకర్షణీయంగా ఉంది.

ఔషధ నిలయం.. పల్లె ప్రకృతి వనం..
సుందరీకరణలో భాగంగా పల్లె ప్రకృతి వనం పేర ఆహ్లాదకర వాతావరణంలో పార్కును ఏర్పాటు చేశారు. నీడనిచ్చే, పూలు, పండ్లు, ము ఖ్యంగా ఔషధ మొక్కలు తెచ్చి ప్రకృతి వనంలో నాటారు. పులిచింత, కలవేప, అల్లనేరడి, టేకు, ఇప్ప, రావి, అడవి తంగడి, చింత, ఉసిరి, శి శు, అశోక, గుల్‌మెహర్‌, కానుగ, సీతాఫలం, సపోట, జామ, చైనా బా దం, వేప, దానిమ్మతో పాటు పలు రకాల మొక్కలను పెంచుతున్నారు.

ఔషధవనంగా తీర్చిదిద్దాం..
పల్లె ప్రకృతి వనాన్ని ఔషధ వనంగా తీర్చిదిద్దాం. పులిచింత, ఇప్ప, రావి, కలవేప, అడవి తంగేడో, అశోక, వేప, గుల్‌మెహర్‌తో పాటు పలు రకాల మొక్కలను నాటి జాగ్రత్తగా కాపాడు తున్నాం. పారిశుధ్యలోపం లేకుండా సిబ్బంది చాలా కృషి చేస్తున్నది. విద్యుత్‌ సమస్యలు తీరిపోయాయి. వైకుంఠ ధామం, డంప్‌యార్డులు పూర్తయ్యాయి. చెత్తాచెదారం తొలగిస్తుండడంతో రోడ్లన్నీ మెరుస్తున్నాయి. గ్రామంలో వ్యాధులు తగ్గుముఖం పట్టాయి.

  • వినోద్‌కుమార్‌, పల్లె ప్రగతి ప్రత్యేకాధికారి, మంచిర్యాల
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గుల్లకోట.. ప్రగతి
గుల్లకోట.. ప్రగతి
గుల్లకోట.. ప్రగతి

ట్రెండింగ్‌

Advertisement