గురువారం 22 అక్టోబర్ 2020
Mancherial - Jan 15, 2020 , 00:06:43

‘చెన్నూర్‌' కారుదే..

‘చెన్నూర్‌' కారుదే..

చెన్నూరు మున్సిపాలిటీ కారుదే అని తేలిపోయింది. ఆ మున్సిపాలిటీ కైవసం చేసుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అభ్యర్థులతో మాట్లాడి ఏకగ్రీవం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఈ మున్సిపాలిటీలో ఇప్పటికే ఏడు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక మ్యాజిక్‌ ఫిగర్‌కు కేవలం మూడు స్థానాల దూరంలో ఉన్నారు. చెన్నూరు మున్సిపాలిటీ క్లీన్‌స్వీప్‌ చేస్తామని విప్‌ బాల్క సుమన్‌ చెబుతుండడంతో కార్యకర్తలు ఉత్సాహంగా రంగంలోకి దిగుతున్నారు.

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఉన్న ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆరు మున్సిపాలిటీలో రాజకీయం ఒక్కో రకంగా ఉంది. దీంతో ఎప్పు డు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ముఖ్యంగా చెన్నూరు మున్సిపాలిటీలో కారు జోరు సాగుతోంది. ఈ జోరు నామినేషన్ల పర్వం మొదలు ఇప్పటి వరకు ఆగడం లేదు.  ఏం చేయాలో దిక్కుతోచక ప్రతిపక్షాలు తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్‌, బీజేపీ కనీసం పోటీలో కూడా నిలబడలేని దుస్థితి. దీంతో కారు బ్రేకులు లేకుండా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆ పార్టీ దూకుడు చూస్తుంటే ఖచ్చితంగా ఆ స్థానం కారుదే. ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఇటు చెన్నూరు, అటు క్యాతన్‌పల్లిపై ప్రత్యేక దృష్టి పెట్టా రు. ముఖ్యంగా చెన్నూరు మున్సిపాలిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అక్కడ క్లీన్‌ స్వీప్‌ అయినా ఆశ్చ ర్యం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.


రికార్డు స్థాయిలో ఏడు  ఏకగ్రీవం..

చెన్నూరు మున్సిపాలిటీలో మొత్తం 18 వార్డులు ఉన్నా యి.  ఇప్పటికే ఆరు ఏకగ్రీవం అయ్యాయి. మంగళవా రం నాలుగు ఏకగీవ్రం కాగా, బుధవారం నామినేషన్లు ఉపసంహరించుకునే సమయానికి ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ ము న్సిపాలిటీలో మంగళవారం  10, 11, 13, 14 వార్డు ల్లో అర్చన గిల్డా, పెండ్యాల స్వర్ణలత, నవాజొద్దీన్‌, మేడ స్రవంతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయా వా ర్డుల్లో పెద్ద ఎత్తున బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఇండిపెండెట్‌ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడం గమనార్హం. ఎట్టి పరిస్థితుల్లో కారుదే విజయం అని భావిస్తున్న ఇతర పార్టీల నేతలు, స్వతంత్ర అభ్యర్థులు లాభం లేదని ముందే కాడి వదిలేస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ నేతల పని సులువు అవుతోంది.  ఇక బుధవారం ముగ్గురు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఏకగ్రీవాల సంఖ్య ఏడుకు పెరిగింది. 2వ వార్డులో కమ్మల శ్రీనివాస్‌, ఐదో వార్డుల్లో నసీమాబేగం, 18 వార్డు గర్రెపల్లి కాంతారాణి ఏకగ్రీవంగా  దీంతో టీఆర్‌ఎస్‌ నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు. పటాకలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు.


విప్‌ బాల్క సుమన్‌ చాణక్యం.. 

ఎన్నికల విషయంలో ప్రభుత్వ విప్‌, చెన్నూరు శాసన సభ్యుడు బాల్క సుమన్‌ దూసుకుపోతున్నారు. ఎన్నికలు ఏవైనా అన్నింటిలో తనదైన వ్యూహాలతో ముం దుకు వెళ్తూ అభ్యర్థులు గెలుపు బాట పట్టేలా ముందు కుసాగుతున్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆ సంస్థలోనే అతి పెద్దదైన శ్రీరాంపూర్‌ ఏరియా లో భారీ మెజారిటీ వచ్చింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో సైతం జిల్లాలోని మూడు స్థానాల్లో బాల్క సుమన్‌కే అ త్యధిక మెజారిటీ వచ్చింది. ఇక పెద్దపల్లి ఎంపీ ఎన్నికల్లోనూ ఏడు నియోజకవర్గాల్లో చెన్నూరు నుంచే అత్యధిక మెజారిటీ రావడం గమనార్హం. సర్పంచ్‌, పరిషత్‌ ఎన్నికల్లోనూ అదే ధోరణి. తాజా మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం బాల్క సుమన్‌ అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. మున్సిపాలిటీలో ఏకంగా ఆరు వార్డులు కైవసం చేసుకోవడంపై పలువురు రాజకీయ పరిశీలకులు సైతం ఆ శ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీలో క్లీన్‌ స్వీప్‌ చేయాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దీంతో ఆ మున్సిపాలిటీలో పోటీ సంగతి అ టుంచితే మిగతా పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు దక్క డం కూడా కష్టమేనని చెబుతున్నారు.


ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ వ్యూహం..  

ఈ మున్సిపాలిటీలో మరోవైపు ఎమ్మెల్సీ పురాణం సతీ శ్‌ కూడా తన వ్యూహాన్ని అమలుచేస్తూ ముందుకు సా గుతున్నారు. ఈ మున్సిపాలిటీలో ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ప్రభావితం చూపుతాయి. ఈ వర్గానికి చెందిన నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులతో కలిసి ముందుకు సాగుతున్నారు. ఆయా వార్డుల్లో నా మినేషన్ల ఉపసంహరణ కోసం కృషి చేస్తున్నారు. ఇక్కడ మిగతా పార్టీ నేతలతో సైతం ఆయనకు చనువు ఉంది. దీంతో వారితో మాట్లాడి తన వంతు సాయంగా నామినేషన్ల ఉపసంహరణకు ముందుకు సాగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చెన్నూరు పీఠం గులాబీ వశం చేసేందుకు ముందుకు సాగుతున్నారు. ఆయనతో పాటు కిం దిస్థాయి నేతలు, కార్యకర్తలు కూడా ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కారు విజయం సాధించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా చెన్నూరు పీఠం టీ ఆర్‌ఎస్‌ వశం అయినట్లే. ఇప్పటికే  అది ఖరారు కాగా, ఇక లాంఛనం మాత్రమే మిగిలింది.


కచ్చితంగా క్లీన్‌ స్వీప్‌ చేస్తాం : బాల్క సుమన్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేస్తాం. ప్రజలందరు టీ ఆర్‌ఎస్‌ వైపే ఉన్నారు. ఆ విషయం మిగతా పార్టీల అ భ్యర్థులకు అర్థమవుతోంది. అందుకే వారు నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నారు. కొందరు అభ్యర్థులు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పట్ల ఆకర్షితులై అందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నారు. అందుకే ఇంతమంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎంపిక ఏకపక్షం అయ్యింది. ఇక్కడ అన్ని స్థానాలు కారువే. ఫలితాలు వేరేలా ఏం ఉండవు. ఇప్పటికైనా మిగతా పార్టీ లు ఈ విషయాన్ని గమనిస్తే మంచిది. ఇక క్యాతన్‌పల్లిపై దృష్టిపెట్టి అక్కడ కూడా క్లీన్‌స్వీప్‌ అయ్యేలా ముం దుకు సాగుతాం.


logo