e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home జోగులాంబ(గద్వాల్) నమ్మకంగా ఉంటూ నట్టేట ముంచాడు

నమ్మకంగా ఉంటూ నట్టేట ముంచాడు

నమ్మకంగా ఉంటూ నట్టేట ముంచాడు
  • దుకాణంలో పనిచేస్తూనే ఆభరణాలు చోరీ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన యజమాని
  • ఖాజా తజముల్‌ హుస్సేన్‌పై కేసు
  • 30 తులాల బంగారం స్వాధీనం

వనపర్తి, జూలై 12 : నమ్మకంగా ఉద్యోగమిచ్చిన యజమాని దుకాణంలోనే చోరీకి పాల్పడుతూ నమ్మకాన్ని వ మ్ము చేసిన యువకుడు చివరకు కటకటాల పాలైన ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. సోమవారం వనపర్తి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కిరణ్‌కుమార్‌ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పట్టణంలోని కొత్తబస్టాండ్‌ సమీపంలో ఉన్న ఆర్‌సీ జ్యువెల్లర్స్‌లో 2005 నుంచి మేనేజర్‌గా పని చేస్తున్న ఖాజా తజముల్‌ హుస్సేన్‌ అలియాస్‌ ఖలీం కేడీఆర్‌ నగర్లో నివాసం ఉంటున్నాడు. ఆర్‌సీ జ్యువెల్లర్స్‌ వ్యాపారి రమేశ్‌ చంద్ర వద్ద నమ్మకంగా పనిచేస్తూ సే ల్స్‌ బాయ్‌ స్థాయి నుంచి మేనేజర్‌ స్థాయికి ఎదిగి నెలకు రూ.30 వేల వేతనం పొందుతున్నాడు.

ఈ క్రమంలో న మ్మకంగా ఉంటూనే కొద్ది రోజులుగా దుకాణంలోని బం గారు ఆభరణాలను దొంగిలించడం మొదలుపెట్టాడు. ఈ నెల 5న యజమాని ఆభరణాలను తనిఖీ చేయగా.. 8 బం గారు ఆభరణాలు (30 తులాలు) తక్కువగా ఉన్నాయి. ఖలీంపై అనుమానంతో వనపర్తి టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఎస్సై మధుసూదన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు సీఐ ప్రవీణ్‌కుమార్‌కు అప్పగించారు. నాటి నుంచి పరారీలో ఉన్న ఖలీం సోమవారం ఇంట్లో ఉన్నాడన్న సమాచారం మేరకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా చోరీ చేసేంది తానేనని అంగీకరించా డు. తన ఇంట్లో ఉన్న 30 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి కో ర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన సీఐ ప్రవీణ్‌, ఎస్సై మధుసూదన్‌, కానిస్టేబుళ్లు రాజు గౌడ్‌, నవీన్‌గౌడ్‌, నగేశ్‌, నాగరాజును డీఎస్పీ అభినందించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నమ్మకంగా ఉంటూ నట్టేట ముంచాడు
నమ్మకంగా ఉంటూ నట్టేట ముంచాడు
నమ్మకంగా ఉంటూ నట్టేట ముంచాడు

ట్రెండింగ్‌

Advertisement