e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home జోగులాంబ(గద్వాల్) పల్లెలు ప్రగతి సాధించాలి

పల్లెలు ప్రగతి సాధించాలి

పల్లెలు ప్రగతి సాధించాలి
  • గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి
  • త్వరలోనే అర్హులందరికీ డబుల్‌బెడ్రూం ఇండ్లు
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

పెద్దమందడి, జూలై11: పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రగతి సాధించాలి, ఆ దిశగా సీఎం కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో మంత్రి పల్లెబస చేపట్టారు. ఆదివారం ఉదయం గ్రామంలో పర్యటించి ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 4వ విడుత పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో ఏ పనులు చేశారు.. హరితహారంలో ఎన్ని మొక్కలు నాటారని పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవోను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో విజయవంతంగా నిర్వహించాల సూచించారు. ఇంటితోపాటు ఇంటి ఆవరణను ప్రజలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అర్హులైన పేదలకు విడుతల వారీగా త్వరలోనే డబుల్‌ బెడ్రూం ఇండ్లను అందజేస్తామని చెప్పారు. మనిగిల్ల నుంచి మోజర్ల రింగ్‌రోడ్డు వరకు 2.5 కిలోమీటర్లు రోడ్డు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం గ్రామ సమీపంలోని చౌదరిపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో మంత్రి పూజలు చేశారు. మనిగిల్ల, పెద్దమందడి ప్రధాన రోడ్డు నుంచి గ్రామంలోని పోశమ్మ గుడి వరకు ఫార్మేషన్‌ రోడ్డును వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. వెంకన్న చెరువు అలుగు కాలువకు లిమిట్‌మెంట్‌ నిర్మాణం చేయాలని ఆదేశించారు. చెరువు మరమ్మతుకు మంజూరైన రూ.20.60లక్షల పనులను వెంటనే టెండర్లు పూర్తిచేసి పనులు చేపట్టాలన్నారు. పెద్దమందడి రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు పెండింగ్‌లో ఉంటే వెంటనే మంజూరు చేయాలని వనపర్తి డీఈకి ఫోన్‌ ద్వారా ఆదేశించారు.

పాప వైద్య ఖర్చులు భరిస్తా..
ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయి మేనత్త శివమ్మ వద్ద పెరుగుతున్న పసిపాప లోకేశ్వరిని మంత్రి నిరంజన్‌రెడ్డి పరామర్శించారు. పసిపాపకు వైద్య సేవలు అవసరమైతే చేయించాలని వనపర్తిలోని ప్రైవేట్‌ దవాఖాన నిర్వాహకులకు సూచించారు. అందుకయ్యే ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద రూ.10 వేలను అందజేశారు. పాపను ఎత్తుకొని ఆడించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌ సరిత, ఎంపీటీసీ వరలక్ష్మి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజప్రకాశ్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి, మాజీ ఎంపీపీలు మన్యపురెడ్డి, దయాకర్‌, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సత్యారెడ్డి, ఉప సర్పంచు శ్రీనివాస్‌గౌడ్‌, నాయకులు తిరుపతిరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు వేణు, ఉన్నారు.

- Advertisement -

మత్స్యకారులకు అండ
వనపర్తి, జూలై11: మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇటీవల ప్రమాదంలో చనిపోయిన 9మంది మత్స్యకారుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. మత్స్యకారులు మరణిస్తే వారికి బీమా సౌకర్యం కల్పించి ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, మాజీ కౌన్సిలర్‌ ఆవుల రమేశ్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పల్లెలు ప్రగతి సాధించాలి
పల్లెలు ప్రగతి సాధించాలి
పల్లెలు ప్రగతి సాధించాలి

ట్రెండింగ్‌

Advertisement