e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home జోగులాంబ(గద్వాల్) గుట్టను తొలిచి.. వనంగా మలిచి

గుట్టను తొలిచి.. వనంగా మలిచి

 • పల్లెప్రగతిలో దూసుకుపోతున్న చందాపూర్‌
 • మంత్రి నిరంజన్‌రెడ్డి చొరవతో ప్రగతి బాటలో..
 • సకల సౌకర్యాలతో రైతువేదిక భవనం
 • ఫలాలనిస్తున్న హరితహారం మొక్కలు

వనపర్తి, జూలై 9 (నమస్తే తెలంగాణ) : ఒ కప్పుడు గుట్ట, బండలు, గుండ్లు తప్పా పచ్చదనానికి ఆనవాళ్లు లేని పరిస్థితి. అభివృద్ధికి శ్రీ కారం చుట్టే సమయంలో శిలాఫలకం పెట్టేందుకు కూడా అనువుగా లేని స్థలం. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వనపర్తి జిల్లాలో ఎక్కడా లేని విధంగా చందాపూర్‌ గ్రా మంలో పల్లె ప్రకృతి వనం నిర్మించారు. బండలను తొలిగించి.. స్థలాన్ని చదును చేసి వివిధ రకాల పండ్లు, పూల మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టారు. నేడు ఆ మొక్కలు పండ్లు కాసే దశకు చేరుకున్నాయి. వనపర్తి పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామ ప్రారంభంలోనే ఆహ్లాదకరమైన వాతావరణంలో పా ర్కు, దాని పక్కనే సకల సౌకర్యాలతో రైతువేదిక, కొద్ది దూరంలోనే వైకుంఠధామం, రైతువేదిక ఆవరణలో నర్సరీ.. ఇలా చూడగానే కా సేపు సేదతీరాలని ఎవరికైనా అనిపించక మా నదు. గ్రామంలో పారిశుధ్యం, మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించారు. చెత్త సేకరణ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తూ శుభ్రంగా ఉంచుతున్నారు. డంపింగ్‌యార్డు, డ్రైనేజీ, రో డ్లు, ఇంకుడుగుంతలు, కరెంటు స్తంభాలు.. ఇ లా పల్లె ప్రగతిలో సమస్యల పరిష్కారానికి చొ రవ చూపుతున్నారు. చెత్త సేకరణకు ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టరు, మొక్కలకు నీరు పోయడానికి ట్యాంకర్‌ను వినియోగించుకుంటున్నారు.

సకల సౌకర్యాలతో రైతువేదిక..
ఐదు వేల ఎకరాలను కలిపి ఒక క్లస్టర్‌గా విభజించి గ్రామంలో సకల సౌకర్యాలతో రైతువేదిక నిర్మించారు. గుట్టపై పల్లెప్రకృతి వనం పక్కనే రైతువేదిక ఏర్పాటు చేశారు. నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రొజెక్టర్‌తోపాటు బుల్లితెరను కూడా సమకూర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రైతువేదిక ఆనుకొని నర్సరీ ఏర్పాటు చేశారు. ఇందులో రకరకాల మొక్కలు పెంచి ఇతర ప్రాంతాలకు అందజేస్తున్నారు.అలాగే చివరి మ జిలీ ప్రశాంతంగా సాగేందుకు గ్రామంలో ఊరు బయట వైకుంఠధామం నిర్మించారు. అంతిమయాత్రలో పాల్గొన్న వారికి ఇబ్బందులు లేకుండా రో డ్డు సౌకర్యం, స్నానాల గదులు, నీటి వసతులు ఏర్పాటు చేశారు.

- Advertisement -

ఆహ్లాదంగా పల్లెప్రకృతి వనం..
పల్లెప్రకృతి వనం నిర్మించేందుకు ప్రభుత్వ స్థలాల కోసం వెతికితే ఎత్తైన గుట్ట తప్పా ఎక్కడా భూమి దొరకలేదు. గుట్టపై ప్రకృతి వనం నిర్మించాలంటే వ్యయప్రయాసలు తప్పవని ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రహించారు. ఇదే విషయాన్ని మంత్రి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా దృష్టికి స ర్పంచ్‌ చెన్నారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రవి తీసుకెళ్లారు. తమ సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి, కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో.. విరామం లేకుండా పనులు చేపట్టారు. హైదరాబాద్‌ వంటి అగ్రశ్రేణి నగరాల్లో ఉండే పార్కులకు తీసిపోకుండా ఏర్పాటు చేశారు. ఎకరాకు మించి ఉన్న స్థలంలో నేరడి, జామ, అరటి, మామిడి, ఉసిరి, టేకు, వేప, సీతాఫలం, చింత, గులా బీ, బంతి, గన్నేరు, మందారం వంటి మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ప్రస్తు తం అరటి చెట్లు గెలలు వేసి ఆకర్షిస్తున్నాయి. ప్రకృతి వనం అందాలను చూ సేందుకు వచ్చిన వారు సేదతీరేందుకు సిమెంట్‌ బెంచీలు ఏర్పాటు చేశారు. ఎత్తుపై ఉండడంతో మట్టి జారిపోకుండా రాళ్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేసి గరక పెంచుతున్నారు. రాళ్లపై వేసిన పెయింటింగ్‌ ఆకట్టుకుంటున్నది.

మంత్రి చొరవతో అభివృద్ధి..
మంత్రి నిరంజన్‌రెడ్డి చొ రవతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. కలెక్టర్‌ షేక్‌యాస్మిన్‌ బాషా సహకారం అం దిస్తున్నారు. పల్లెప్రగతికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌ సార్‌కు కృతజ్ఞతలు. గ తంతో పోలిస్తే పల్లెప్రగతితో మా గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది. పరిశుభ్ర త, మౌలిక వసతు కల్పనలో ముందున్నాం. పల్లె ప్రకృతి వనం ప్రత్యేకత సంతరించుకున్నది. ఇప్పటికే మంత్రి, కలెక్టర్‌ అభినందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శిస్తారని మంత్రి చెప్పారు. ఎంతో సంతోషంగా ఉంది.

 • టి.చెన్నారెడ్డి, సర్పంచ్‌, చందాపూర్‌
  గ్రామస్తుల సహకారంతో..
  పల్లె ప్రగతి కార్యక్రమానికి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు సహకరించడంతో అభివృద్ధి పనులు వేగంగా చేపడుతున్నాం. డ్రైనేజీలు, వైకుంఠధామం, చెత్త సేకర ణ, పల్లెప్రకృతి వనం, ఇం కుడు గుంతలు, నర్సరీ ఏ ర్పాటు వంటి కార్యక్రమాలకు అందరి నుచి సహకారం లభిస్తున్నది. ప్రభుత్వం ఏ కార్యక్రమం చే పట్టినా గ్రామస్తులు భాగస్వాములవుతున్నారు. ఇ క్కడి ప్రగతిని ఎప్పడికప్పుడు ఉన్నతాధికారులకు వివరిస్తున్నాం.
 • ఎస్‌.రవి, పంచాయతీ కార్యదర్శి
  ఊరు చాలా బాగుంది..
  మా ఊరు ఇప్పుడు చా లా బాగుంది. మురుగులే దు. కంపు వాసన లేదు. రో డ్లపై చెత్తలేదు. అంతా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. పల్లె ప్రకృతి వనం సూపర్‌. గ్రామంలో అన్ని పనులు చేస్తున్నారు. ఇలా మా ఊరును ఎప్పుడూ చూడలే. సీఎం కేసీఆర్‌ సారు చేపడుతున్న పనులతో ఊరికి కళ వచ్చింది.
 • లక్ష్మి, గ్రామస్తురాలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana