శనివారం 11 జూలై 2020
Mahabubnagar - May 26, 2020 , 02:53:52

రూ.1.50 కోట్ల దేవుడి సొమ్మును కాజేశారు

రూ.1.50 కోట్ల దేవుడి సొమ్మును కాజేశారు

శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చిన భక్తులు చెల్లించిన ముడుపులనే కాకుండా ఆర్జిత సేవా టిక్కెట్ల సొమ్ము ను కాజేసిన దోషులెవరో తేలాల్సి ఉన్నది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.1.50 కోట్ల సొమ్మును కాజేశారు. ఆలయంలో భారీ మెత్తాన్ని దోచేసి శ్రీశైల మల్లన్న ఖజానాకే గండికొట్టారు. దేవస్థాన అభివృద్ధికి పాటుపడాల్సిన అధికారులు, సిబ్బంది కుమ్మక్కై అందివచ్చిన సాంకేతికతను ఉపయోగించుకుని ఖజానాకు ఎ సరుపెట్టారు. దేవస్థానం నిర్వహిస్తున్న ప్రాణదాన ట్రస్ట్‌, అన్నదానం, గో సంరక్షణ ట్రస్ట్‌ల అభివృద్ధికి భక్తులు లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చి వెళ్తుంటారు. ఆలయంలో వివిధ స్లాట్స్‌లో టిక్కెట్లు కొనుగోలు చేయడం, బసచేసే గదులకు సంబంధించి ఆన్‌లైన్‌ ద్వారా కూడా బుకింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉన్నది. 

ఇదే అదునుగా భావించిన సిబ్బంది వెబ్‌సైట్‌ లోపాలను గుర్తించి రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో డూప్లికెట్‌ టిక్కెట్లను విక్రయించి అందినంత సొమ్ము చేసుకున్నారు. 

కాగా, ఈ విషయంపై సోమవారం దేవస్థాన పరిపాలనా భవనంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి కేఎస్‌ రామారావు విలేకరులతో మాట్లాడారు. భక్తులు చెల్లించిన ముడుపులు, ఆర్జిత సేవా టిక్కెట్ల సొమ్మును పక్కదోవ పట్టించిన అధికారులు, సిబ్బందిని ఉపేక్షించేది లేదన్నారు. నాలుగేండ్లుగా దేవస్థానంలో విరాళం కౌంటర్‌, టిక్కెట్ల పంపిణీ కేంద్రాల్లో కాంట్రాక్ట్‌ లేబర్‌గా పనిచేస్తున్న సిబ్బంది కొందరు ఆలయ ఖజానాకు గండికొడుతున్నారని చెప్పారు. ముఖ్యంగా వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపాలను గుర్తించి భక్తులకు ఇచ్చే శీఘ్ర దర్శనం, అభిషేకం, సుప్రభాతం, మహా మంగళహారతి, కుంకుమార్చన టిక్కెట్ల జారీలో అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యిందని వివరించారు.

 అలాగే గదుల కేటాయింపు, టోల్‌గేట్‌లో వాహనాల ఎంట్రీఫీజ్‌ టికెట్ల ముద్రన, వసూళ్ల మెత్తాన్ని దేవస్థానానికి జమ చేసే ప్రక్రియల్లో భారీ కుంభకోణాలకు పాల్పడినట్లు తెలుస్తుందన్నారు. అన్ని విభాగాల్లో కలిపి సుమారు రూ.1.50 కోట్లను కాజేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్నారు. దేవస్థానం ఆదాయాన్ని పక్కదోవ పట్టించేందుకు కారకులైన అధికారులు, సిబ్బందితో పాటు వెబ్‌సైట్‌లో అవకతవకలు సృష్టించిన వారిపై విచారణ చే యడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నిపుణులతో ప్రత్యే క కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

 రెండుమాసాల కిందట విరాళాల కేంద్రంలో జరిగిన అవకతవకలపై విచారణ ప్రారంభించగా.. రోజుకో కొత్త కుంభకో ణం బయటపడటంతో అధికారుల పర్యవేక్షణలో ని ర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. ఆన్‌లైన్‌ నగదు వసూళ్ల మోసాలపై ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక విచారణ అధికారితో పాటు సాంకేతిక నిపుణులతో పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అక్రమార్జనకు పాల్పడినవారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్క రూపాయి కూడా విడిచిపెట్టేది లేదన్నారు.


logo