e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home జోగులాంబ(గద్వాల్) పల్లె ప్రగతిపై గ్రామసభలు

పల్లె ప్రగతిపై గ్రామసభలు

పల్లె ప్రగతిపై గ్రామసభలు
  • గ్రామాల్లో పర్యటించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
  • ప్రణాళికాబద్ధంగా పలు అభివృద్ధి పనులు
  • పల్లె ప్రకృతి వనాలకు స్థలాల కేటాయింపు

నర్వ, జూలై 10 : పల్లె ప్రగతి కార్యక్రమాలు మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం ముగిశాయి. పలు గ్రా మాల్లో ప్రత్యేకాధికారి శివప్రసాద్‌రెడ్డి, ఎంపీడీవో రమేశ్‌కుమార్‌ పర్యటించి కొనసాగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం కొమర్‌లింగంపల్లి గ్రామసభలో పాల్గొని గ్రా మానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులు, సమస్యలపై చర్చించారు. చిత్తనూర్‌ గుట్ట నుంచి ఉంద్యాల శివారు వరకు 8 కిలో మీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడంతోపాటు అంతర్గత రోడ్ల ఏర్పాటు, డ్రైనేజీలను శుభ్రపరచడం, వీధి దీపాలు ఏర్పాటు చేయడం, పూరాతన బావుల పూడ్చివేత, శిథిలావస్థలో ఉన్న ఇండ్ల తొలగింపు, పిచ్చి మొక్కల తొలగింపు పనులు నిర్వహించిన సర్పంచ్‌ అరవింద్‌రెడ్డి, మిగతా ప్రజాప్రతినిధులను, పంచాయతీ సిబ్బందిని అభినందించారు.

కొత్త వారికి అవకాశం కల్పించాలి
ధన్వాడ, జూలై 10 : దుకాణ సముదాయంలో కొత్త వా రికి అవకాశం కల్పించాలని పలువురు కోరారు. ధన్వాడ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శనివారం సర్పంచ్‌ అమరేందర్‌రెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. సమావేశంలో పల్లె ప్రగతిలో చేపట్టిన పనులపై వివరించా రు. ప్రతి ఇంట్లో కనీసం ఆరు మొక్కలైనా నాటాలని కోరా రు. గ్రామ పంచాయతీకి సంబంధించిన దుకాణ సముదాయంలో పాత వారిని తొలగించి కొత్త వారికి టెండర్‌ ప్రకా రం అవకాశం కల్పించాలని గ్రామసభలో పలువురు కోరా రు. పంచాయతీ ఎదుట నిర్మించిన దుకాణాలను వినియోగంలోని తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు ఉమేశ్‌ కుమార్‌, గోవర్ధన్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ యూసుఫ్‌ అలీ, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం
ఊట్కూర్‌, జూలై 10 : గ్రామాభివృద్ధికి పాలకవర్గ సభ్యులు, ప్రజలు సహకరించాలని సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. శనివారం గ్రామ పంచాయ తీ కార్యాలయ ఆవరణలో నిర్వహించి న గ్రామసభకు హాజరైన వారినుద్దేశిం చి ఆయన మాట్లాడారు. ప్రతిఒక్కరూ సహకరిస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పంచాయతీ నిధు లు, స్టేట్‌ ఫైనాన్స్‌ నిధులతో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను సభ్యులకు వివరించారు. హరితహారం లో భాగంగా పచ్చదనం పెంచాలని కోరారు. తడి, పొడి చె త్త వేర్వేరుగా చేయడంపై కలిగే లాభాలను వివరించారు. మరుగుదొడ్ల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించి వారి లో మార్పు కోసం కృషి చేయాలన్నారు. మల్లేపల్లిలో సర్పం చ్‌ మాణిక్యమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన గ్రామసభలో పల్లె ప్రగతి అనంతరం మిగతా పనుల ప్రతిపాదనపై తీర్మా నం చేశారు. గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు. పల్లె ప్రగతి విజయవంతం కోసం కృషి చేసిన వార్డు సభ్యులు, ఈజీఎస్‌, అంగన్‌వాడీ సిబ్బందిని సర్పంచులు అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కాళప్ప, ఎంపీవో రవికుమార్‌, పంచాయతీ కార్యదర్శి జాన్‌, ఉపసర్పంచులు, పం చాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

పల్లె ప్రకృతి వనానికి స్థలం కేటాయింపు
మక్తల్‌ రూరల్‌, జూలై 10 : మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమాలు శనివారం ఆయా గ్రామాల్లో ముగిశాయి. పది రోజులపాటు జరిగిన పల్లె ప్రగతి లో ప్రధానంగా పారిశుధ్యం, మొక్కల పెంపకం, డ్రైనేజీల వ్యవస్థ మెరుగుపరచడానికి చేపట్టాల్సిన పనులు, అంతర్గత రోడ్ల ఏర్పాటుకు ప్రణాళికలను తయారు చేశారు. అందులో భాగంగా పంచలింగాలలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు కోసం 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్లు ఎంపీడీవో శ్రీధర్‌ తెలిపారు. గ్రామస్తులతో చర్చించి భూమిని పరిశీలించామన్నా రు. అలాగే లింగంపల్లిలో మొక్కలను నాటి ట్రీగాడ్డ్‌లను ఏ ర్పాటు చేశారు. కార్యక్రమంలో ఏపీవో పావని, పంచలింగా ల సర్పచ్‌ తిక్కమ్మ, లింగంపల్లి సర్పంచ్‌ సుజాత, ఎంపీటీసీలు లత, రాంలింగప్ప, నాయకులు పాల్గొన్నారు.

వాల్‌పోస్టర్ల పంపిణీ
నారాయణపేట రూరల్‌, జూలై 10 : మండలంలోని జా జాపూర్‌, సింగారం, అప్పక్‌పల్లి, అప్పిరెడ్డిపల్లి, కోటకొండ, కొల్లంపల్లి, పేరపళ్ల తదితర గ్రామాల్లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమం శనివారంతో ముగిసింది. గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి 10 రోజులుగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను, చేపట్టిన పనులను గురించి పంచాయతీ కార్యదర్శులు గ్రామస్తులకు వివరించారు. పల్లె ప్రగతి ముగింపు సందర్భంగా గ్రామాల పంచాయతీల వద్ద రంగు రంగుల ముగ్గులతో అందంగా ముస్తాబు చేశారు. అలాగే పాలమూ ర్‌ రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి ప్రజా అభిప్రాయ సేకరించిన వాల్‌పోస్టర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ శంకర్‌, రైతుబం ధు సమితి జిల్లా సభ్యుడు జగన్‌మోహన్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరు లు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పల్లె ప్రగతిపై గ్రామసభలు
పల్లె ప్రగతిపై గ్రామసభలు
పల్లె ప్రగతిపై గ్రామసభలు

ట్రెండింగ్‌

Advertisement