e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home జిల్లాలు నాణ్యతాప్రమాణాలతో పనులు చేపట్టాలి

నాణ్యతాప్రమాణాలతో పనులు చేపట్టాలి

నాణ్యతాప్రమాణాలతో పనులు చేపట్టాలి

మూడు నెలలో ప్రాజెక్టు పూర్తి చేయాలి
ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
చెక్‌ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన

నారాయణపేట రూరల్‌, ఏప్రిల్‌ 17 : నిర్మాణ పనులు నాణ్యతాప్రమాణాలతో చేపట్టాలని ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని సింగారం-జాజాపూర్‌ మలుగు వాగుపై చెక్‌ డ్యాం నిర్మాణానికి శనివారం ఎమ్మె ల్యే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రూ.2.31కోట్లతో 67 మీట ర్ల పొడవుతో చెక్‌ డ్యాం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపా రు. దీని వల్ల చుట్టు పక్కల గ్రామాల్లో నీళ్లు పుష్కలంగా ఉంటాయన్నారు. పనులను మూడు నెలలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. చెక్‌ డ్యాం నిర్మాణానికి సంబంధించిన నీటి పారుదల శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప థకం కాల్వ ఈ గ్రామానికి దగ్గరగా వెళ్తుందని వాటితో చెక్‌ డ్యాంకు నీటిని అందిస్తామన్నారు. దీంతో ఎల్లప్పుడు నీళ్లు పుష్కలంగా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నారు. అ నంతరం ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఈఈ రవీందర్‌కిషన్‌, డీఈ ఎల్లయ్య, ఏఈఈ ఖాలీల్‌ అహ్మద్‌ ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైరపర్సన్‌ సురేఖ, స ర్పంచ్‌ జయంతి, ఎంపీటీసీ రాంరెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్‌రె డ్డి, జెడ్పీటీసీ అంజలి, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ నర్సింహరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ హరినారాయణ భట్టడ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ జగదీశ్‌, టిఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, నాయకులు, కా ర్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యసేవలు అందించాలి
నారాయణపేట, ఏప్రిల్‌ 17 : ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి అన్నా రు. పట్టణంలో సునంద మల్టీ స్పెషాలిటీ అండ్‌ క్రిటికల్‌ కేర్‌ దవాఖానను ప్రారంభించారు. దవాఖానలోని పలు వార్డులను పరిశీలించారు. అనంతరం దవాఖాన నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించారు.

Advertisement
నాణ్యతాప్రమాణాలతో పనులు చేపట్టాలి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement