e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 15, 2021
Home జిల్లాలు నియమ నిష్ఠలకు ‘నెల’వు

నియమ నిష్ఠలకు ‘నెల’వు

నియమ నిష్ఠలకు ‘నెల’వు

ప్రారంభమైన రంజాన్‌ మాసం
ఉపవాస దీక్ష, ప్రత్యేక సమాజ్‌లు
కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇండ్ల వద్దే ప్రార్థనలు

బాలానగర్‌, ఏప్రిల్‌ 16 : ఇస్లాం మతంలో రంజాన్‌ నెలకు విశేష ప్రాధాన్యత ఉంది. ధానధర్మాలకు ప్రతీకగా ఈ మాసం నిలుస్తున్నది. నెల రోజులపాటు ఉపవాస దీక్షలతో శరీరం, ఆత్మలోని మలినాలు ప్రక్షాళన కావడంతో పాటు సర్వపాపాలు దహించుకుపోతాయని ముస్లిం మత పెద్దలు చెబుతారు. సూర్యోదయ సమయంలో ‘సహర్‌’ నుంచి సూర్యాస్తమయం సమయంలో జరిపే ‘ఇప్తార్‌ వర కు మంచి నీళ్లు సైతం తాగకుండా ఉపవాసం చేస్తారు. ము స్లింలు పవిత్రంగా భావించే ఖురాన్‌ గ్రంథం ఈ మాసంలోనే (రంజాన్‌) ఆవిర్భవించిందని ముస్లిం మత పెద్దలు చెబుతారు. ముస్లింలు ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధల తో జరుపుకుంటారు. ఏప్రిల్‌ 1 3 నుంచి మే 13వ తేదీ వరకు ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం. ఈ మాసంలో ముస్లింలు కఠిన నిబంధనలతో కూ డిన ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో గడుపుతారు. ఉదయం 4 గంటల వరకే నిద్ర లేచి నమాజ్‌ చేస్తారు. అలా ప్రతి రో జు ఐదు పూటలు నిర్వహిస్తారు. వీటిని పంచ్‌వక్త అని అం టారు. ఇస్లామిక్‌ క్యాలెండర్‌ ప్రకారం 9వ నెల రంజాన్‌ మాసం, పండుగలు ఏవైనా అందులో ఏదో ఒక సందేశం ఉంటుందని ప్రత్కేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా వైర స్‌ నేపథ్యంలో ఈసారి ముస్లింలు ఇంటి వద్దనే నమాజ్‌ చే సుకుంటున్నారు.
తరవి..
నమాజ్‌-ఇ-యేషా అనంతరం రాత్రి 10 గంటల వర కు పవిత్ర ఖురాన్‌ను చదువుతారు. అనంతరం దాదా పు 20 నమాజ్‌లు చేస్తారు. వీటిని ‘తరవి’ నమాజ్‌లు అని అంటారు.
నియమాలకు
‘రోజా’ పెట్టింది పేరు..
రోజా అనేది పవిత్రమైన ఉపవా సం అనేదానికి పర్యాయపదంగా వా డుతారు. రోజా ఉన్న భక్తుడు తప్పనిసరిగా ఉదయం సహర్‌ నుంచి ఇప్తార్‌ వరకు కనీసం ఉమ్మీ ని కూడా మింగకుండా కఠిన ఉపవాసాలు చేయాలి. సహ ర్‌ ముందు తిన్న ఆహారమే రాత్రి ఇప్తార్‌ వరకు మంచినీరు కూడా ముట్టుకోకుండా కఠిన ఉపవాసాలు నిర్వహిస్తారు. ఈ రోజా వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఏకాగ్రత పెరుగుతున్నది.
సహర్‌..
ప్రతి ముస్లిం రోజా ఉండే రోజు ఉదయం 3 గంటలకు నిద్ర లేచి ఆహారం సిద్ధం చేసుకొని తీసుకుంటారు. దీనినే సహర్‌ అంటారు. సహర్‌ అనేది ఉదయం ఉపవాసం ప్రారంభించే ముందు తీసుకొనే భోజనం. అనంతరం ఫజార్‌ నమాజ్‌ చేసి ఉపవాసాన్ని ప్రారంభిస్తారు.
జకాత్‌..
ప్రతి ముస్లిం జకాత్‌ చేయాలనేది ముస్లింల విశ్వాసం. జకాత్‌ అనగా ధానధర్మాలు చేయడం అంటారు. మనం సంపాదించే దానిలో ఖర్చులకు పోనూ మిగతా సంపాదనలో 2.5 శాతం దానం చేయాలి. అలాగే పేద ముస్లింలు సంతోషంగా రంజాన్‌ నెల గడుపడానికి వీలుగా తమకు తోచిన సహాయం చేయాలనేదే ఈ జాకత్‌. దీని ద్వారా ధనిక ముస్లింలు అనేక మంది పేద ముస్లింలకు పండుగకు బియ్యం ఇతర నిత్యావసర సరకులు, అలాగే నూతన వస్ర్తాలను దానం చేస్తుంటారు.
‘పంచ్‌ వక్త’ నమాజ్‌లు..
ఉదయం 5.15 గంటలకు చదివే నమాజ్‌ను ఫజార్‌ నమాజ్‌
మధ్యాహ్నం 1.30కి చదివే నమాజ్‌ను జోహర్‌
సాయంత్రం 5.15 గంటలకు చదివే నమాజ్‌ను హసర్‌
రాత్రి 7.00 గంటలకు చదివే నమాజ్‌ను మగరిభ్‌
రాత్రి 8.15 గంటలకు చదివే నమాజ్‌న్‌ నమాజ్‌-ఇ-యేషా అంటారు.
ఇఫ్తార్‌..
రాత్రి ఉపవాసాలను విరమించి తీసుకునే ఆహారాన్ని ఇఫ్తార్‌ అంటారు. ముఖ్యంగా కర్జూర, ఆరటి, మామిడి, జామ తదితర పండ్లతో ఇఫ్తార్‌ తీసుకుంటారు. అనంతరం మాములు ఆహారం తీసుకుంటారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ..
పవిత్రమైన రంజాన్‌ మాసాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతోపాటు మహమ్మారి కరోనాను జయించేందుకు ప్రభుత్వం సూచిస్తున్న నిబంధనలు పాటిస్తూ పండుగను నిర్వహించుకోవాల్సి ఉంది. ఎవరెక్కడికి వెళ్లినా ప్రతిఒక్కరూ మాస్కు ధరించి ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి ఉంది. నిబంధనలు పాటిస్తూ పండుగ రోజుల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అందరికీ ఉందని చెప్పవచ్చు.
పవిత్ర మాసం రంజాన్‌
రంజాన్‌ మాసం పవిత్రమైనది. ఈ మాసంలో చేసే ఉపవాసాలు కఠిన నియమాలతోపాటు ఏకగ్రత ఉంటుంది. ప్రతి ముస్లిం ఈ నెలలో రోజా ఉంటా రు. అలాగే ముస్లింలు తమకు తోచిన విధంగా జకాత్‌ ఇస్తుంటారు. తప్పనిసరిగా పంచ్‌వక్త నమాజ్‌లు చేస్తాం. దీని వల్ల దేవుడిపై నమ్మకం పెరుగుతుంది.
లతీఫ్‌, మొదంపల్లి, బాలానగర్‌ మండలం

ఇవి కూడా చదవండి

సంగారెడ్డిలో యువ‌కుడి దారుణ‌ హ‌త్య

టీసీఎల్ న్యూ కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్‌! ఎలాగంటే!!

Advertisement
నియమ నిష్ఠలకు ‘నెల’వు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement