e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home News Mahabubnagar: సంఘంతోనే భద్రత.. పీఆర్టీయూ టీఎస్ స్వర్ణోత్సవ సంబురాల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్

Mahabubnagar: సంఘంతోనే భద్రత.. పీఆర్టీయూ టీఎస్ స్వర్ణోత్సవ సంబురాల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్

మహ్మదాబాద్: ఉద్యోగులకు సంఘంతోనే పూర్తి భద్రత ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం మహ్మ దాబాద్ మండల కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణోత్సవ సంబు రాలు మరియు విద్యాసదస్సు కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సత్ప్రవర్తన, మంచి నాయకత్వం, సంస్కృతి సంప్రాదాయాలకు మార్గదర్శకత్వం చేసేది విద్యా వ్యవస్థేనని అన్నారు.

పీఆర్టీయూ సంఘం కుటుంబం లాంటిదని ఉపాధ్యాయ సమస్యల సాధనలో ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాక ముందు వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. కడుపు కాలి అల్లాడిపోయే కాలం నుంచి కడుపునిండా భోజనాలు, ఉచిత పాఠ్య పుస్తకాలు, దుస్తులను ఉచితంగా పంపిణీ చేసి పేద విద్యార్థులను ప్రోత్సహిస్తున్నదని తెలిపారు.

- Advertisement -

గతంలో ఎన్నడూ లేనివిధంగా వెయ్యి గురుకులాలను ఏర్పాటు చేసి అందరికీ విద్యను అందించడంలో తెలంగాణ ప్రభు త్వం ముందంజలో ఉందని తెలిపారు. కరోనా సమయంలో ప్రతి ఉద్యోగిని కాపాడుకున్న ఘనత ప్రభుత్వానిదేనని తెలిపా రు. నేడు అడుగకముందే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు తదితర ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచి అందరికీ అండ గా నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందినప్పుడే ఉద్యోగులకు జీతభత్యాలు పెరుగుతాయని ప్రభుత్వం అన్ని రంగాల అబివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నదని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో ఉద్యోగులు భాగస్వాములై కృషి చేయాలన్నారు. పాఠాలతో పాటు ప్రభుత్వం అందుకున్న విజయాలను తెలియజేయాలన్నారు. రాష్ట్రంలో ఏ సంఘం వారికైనా ఏమస్య వచ్చిన అందరికీ అండగా ఉంటామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ఉండే ఉద్యోగులు శాఖల సమన్వయ లోపాలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించడానికి సులువుగా ఉంటుందని తెలిపారు.

ఇదిలా ఉండగా మంత్రి ప్రసంగిస్తున్న సమయంలో సమీపంలోని మసీదులో ముస్లింలు ప్రార్థన చేసుకుంటుండగా హజాను గౌరవించి తన ప్రసంగాన్ని మధ్యలో ఆపి హజాన్ అయిపోయిన తర్వాత తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు.


ఉద్యమంలో ఉద్యోగ సంఘాల పాత్ర కీలకం.. పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి
ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల పాత్ర కీలకమైందని పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాఠశాలలు మరింత బలోపేతమయ్యాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ సంఘాలకు అండగా ఉన్నారని వారి సమస్యలను ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉద్యోగుల గుండెల్లో కేసీఆర్ నిలిచిపోయాడని తెలిపారు. పీఆర్టీయూ భవనం రాష్ట్రంలో పరిగిలోనే మొదటి సారిగా నిర్మించడం జరిగిందని తెలిపారు.

కార్యకర్తల కృషితో సంఘం ఉన్నత స్థాయికి చేరింది: ఎమ్మెల్సీ కాటేపల్లి
పీఆర్టీయూ కార్యకర్తల కృషితో మొక్కలా ఉన్న సంఘం మహా వృక్షంలా తయారైందని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి తెలిపారు. సంఘటితంగా ఉండి సంఘాన్ని మరింత అబివృద్ధి చేసుకునేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. రాష్టంలోనే మొదటి స్వర్ణోత్సవ సంబురాలు నిర్వహించిన మహ్మదాబాద్ పీఆర్టీయూ శాఖను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్‌రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, సర్పంచ్ పార్వతమ్మ, ఎంపీటీసీ చెన్నయ్య, ప్రధానోపాద్యాయుడు వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, రాధారెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి రఘురాంరెడ్డి, మండల అధ్యక్షుడు విజయానంద్‌రెడ్డి, కార్యదర్శి విజయ్కుమార్ గౌడ్, రాష్ట్ర అసోసియేట్ బా ధ్యులు జైపాల్‌రెడ్డి, జిల్లా అసోసియేట్ బాధ్యులు శ్రీధర్‌రెడ్డి, కార్యదర్శులు శ్రీనివాస్‌రెడ్డి, విజయ్‌కుమార్, భీంరెడ్డి, రమేశ్, ఖాదర్, రాష్ట మహిళా కార్యదర్శి సుజాత, గీత, రత్నమాల, మండలాల పీఆర్‌టీసీ అధ్యక్ష,కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement