e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home మహబూబ్ నగర్ లాక్‌ ఓపెన్‌

లాక్‌ ఓపెన్‌

  • లాక్‌డౌన్‌ను ఎత్తేసిన ప్రభుత్వం
  • యథావిధిగా కార్యకలాపాలు
  • తెరుచుకోనున్న సినిమాహాళ్లు, వ్యాపార సముదాయాలు, మాల్స్‌
  • రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు
  • జూలై 1 నుంచి విద్యాసంస్థలు ఓపెన్‌
లాక్‌ ఓపెన్‌

మహబూబ్‌నగర్‌ జూన్‌ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వనపర్తి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన చర్యలతో కరోనా తగ్గుముఖం పట్టడంతో కొన్నిరోజులుగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఎత్తేసింది. శనివారం హైదరాబాద్‌లో జరిగిన కేబినెట్‌ సమావేశంలో పూర్తిస్థాయి అన్‌లాక్‌ నిర్ణయం తీసుకున్నది. ప్రజ ల ప్రాణాలకు నష్టం కలుగకుండా కఠిన నిబంధనలు అమలుచేసి సత్ఫలితాలు సాధించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇక యథావిధిగా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని ఆదేశాలిచ్చింది. నిబంధనలను పూర్తిస్థాయిలో సడలించి వ్యాపార, వాణిజ్యవర్గాల కార్యకలాపాలు, ప్రజల ఉపాధి మార్గాలకు ఊరట కల్పించింది. దీంతో విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, దుకాణాలు, కల్యాణ మండపాలు తెరుచుకోనున్నాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు పూర్తిస్థాయిలో రోడ్డెక్కనున్నాయి. అలాగే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు దొరికే అవకాశముం ది. ముఖ్యంగా కూలీలకు ప్రతిరోజూ పని దొరికే అవకాశాలు ఉన్నాయి.

లాక్‌డౌన్‌ ఎత్తివేత మంచిదేనంటున్న జనం
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఎత్తివేతను అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గడం, వైరస్‌ పూర్తి నియంత్రణలోకి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సరైన నిర్ణ యం తీసుకున్నదని పాలమూరువాసులు అంటున్నా రు. లాక్‌డౌన్‌ సందర్భంగా విధించిన అన్నిరకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని తీసుకున్న నిర్ణయంవల్ల పేదలకు ప్రయోజనమని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మరోవైపు విద్యాసంస్థలు తెరవడంవల్ల ఇన్నాళ్లు ఆన్‌లైన్‌ క్లాసులు మాత్రమే విన్న విద్యార్థులు తిరిగి ప్రత్యక్ష బోధనకు చేరువయ్యేందుకు అవకాశం ఏ ర్పడింది. మరోవైపు వివిధ ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బందికి సైతం తిరిగి వేతనాలు పొందేందుకు వీలవుతుంది. మొత్తంగా ప్రజా జీవనం, సామాన్యుల బతుకుదెరువు తిరిగి గాడిన పడతాయి.

- Advertisement -

స్వీయక్రమశిక్షణే శ్రీరామరక్ష
లాక్‌డౌన్‌ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయం లో నిర్లక్ష్యం తగదని, తప్పనిసరిగా మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్‌ ఉపయోగించ డం.. తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నది. లాక్‌డౌన్‌ ఎత్తేసినా స్వీయ క్రమశిక్షణే శ్రీరామరక్ష అనే విషయాన్ని ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నది. కరోనా కేసులు విస్తరణతో మే 14 నుంచి 20 వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్‌డౌన్‌ సడలింపు ఇవ్వ గా… ఆ తర్వాత మే 21 నుంచి 31 వరకు మరోసారి లాక్‌డౌన్‌ పొడిగించారు. అయితే ఉదయం 6నుంచి మ ధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపునిచ్చారు. జూన్‌ 1 నుంచి 10 వరకు లాక్‌డౌన్‌ అమలు చేశారు. చివరగా మరో 10రోజులపాటు లాక్‌డౌన్‌ పొడిగించారు. ఉదయం 6నుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్‌డౌన్‌ సడలించాలని, సాయంత్రం 5నుంచి 6 గంటల వరకు అంటే గంటపాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. అయితే శనివారం రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో పూర్తిగా ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఫలించిన వ్యూహరచన
ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తూనే ప్రజలకు క్షేత్రస్థాయిలో ప్రాథమికంగా వైద్యం అందించాలనే నిర్ణయానికి వచ్చి జ్వరసర్వే వంటి విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. చిన్నగా తుమ్ము లేదా దగ్గు వచ్చినా కరోనా వచ్చిందని బెంబేలు పడిపోతున్న ప్రజలకు అండగా ఉండటానికి దేశంలో ఎక్కడా లేనివిధంగా జ్వరసర్వేను చేపట్టి మందులు అందజేసింది.కొవిడ్‌ లక్షణాలు ఉన్నాయని అనుమానం వస్తే వారిని దవాఖానలకు పంపించి చికిత్స అందించింది. ఐసొలేషన్‌ సెంటర్లలో ఆక్సిజన్‌ ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించింది. కరోనాపై ప్రజలను చైతన్యపర్చడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లాక్‌ ఓపెన్‌
లాక్‌ ఓపెన్‌
లాక్‌ ఓపెన్‌

ట్రెండింగ్‌

Advertisement