e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home జిల్లాలు సర్‌కారు తగ్గలె..సాయం ఆగలె

సర్‌కారు తగ్గలె..సాయం ఆగలె

సర్‌కారు తగ్గలె..సాయం ఆగలె

జూన్‌ 15నుంచే రైతుబంధు
నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ
యాసంగిలో అవలంభించిన విధానంలోనే అమలు
విలీన బ్యాంకుల ఖాతాల వివరాలు ఇవ్వాల్సిందే..

మహబూబ్‌నగర్‌, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతిని ధి) : కరోనాతో ప్రపంచం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వ్యవస్థలన్నీ కునారిల్లిన తరుణంలో దేశాలకు దేశాలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇలాంటి సంకట స్థితిలోనూ తెలంగాణ సర్కార్‌ మాత్రం అన్నదాత వెంటే నడుస్తోంది. రైతన్నకు చిన్న ఇబ్బంది లేకుండా చూస్తోంది. వానకాలం రైతుబంధు పెట్టుబడి వచ్చే నెల 15 నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆ ర్‌ ప్రకటించారు. కేవలం 10 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చే యాలని ఆదేశించారు. గతంలో ఉన్న నిబంధనల మేరకే రైతుల ఖాతాల్లో కేటగిరీల వారీగా జమ కానున్నాయి. గత యాసంగిలో అనుసరించిన విధానాలనే ఈసారి కూడా అ ధికారులు పాటించనున్నారు. అయితే జూన్‌ 10ని కట్‌ ఆఫ్‌ తేదీగా నిర్ణయించింది. అంటే జూన్‌ 10వ తేదీ వరకు ధ రణి పోర్టల్‌లో నమోదైన ఖాతాల్లో మాత్రమే జూన్‌ 15 నుంచి డబ్బులు జమ చేయనున్నారు. మరోవైపు పలు జా తీయ బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్లు మారాయి. కావున రైతులు విలీనమైన బ్యాంకుకు సంబంధించి కొత్త పాసుపుస్తకాల జిరాక్స్‌ కాపీని ఏపీవోలకు అం దించాల్సి ఉంటుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో గత యాసంగిలో 9,17,500 మంది రైతుల ఖాతాల్లో రూ.1233.99 కోట్లు జమ అయ్యాయి. ఈసారి ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నది.
కేవలం 10 రోజుల్లోనే ఖాతాల్లోకి..
జూన్‌ 15 నుంచి 25వ తేదీ లోపల రైతుబంధు పంటసాయం కింద ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణారావును ఆదేశించారు. దశలవారీగా కేవలం 10 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి కానున్నది. గతేడాది పొందిన రైతులతోపాటు కొత్తగా అర్హులైన వారిని ఈ జాబితాలో చేర్చేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. జూన్‌ 10వ తేదీ వరకు పార్ట్‌-బీ నుంచి పార్ట్‌-ఏలోకి చేరిన భూములకూ రైతుబంధు వర్తింపజేయాలని సీఎం ఆదేశించారు. కొత్త రిజిస్ట్రేషన్లు చేసుకున్న రైతులకు సైతం జూన్‌ 10 లోపు నిబంధనే వర్తించనుంది. ఈసారి ధరణి ద్వారా జరిగిన భూ విక్రయాలతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సు మారు 5వేల మందికి పైగా కొత్త రైతులు ఈ సాయం పొం దేందుకు అర్హులై ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొందరు వ్యవసాయ భూములను కొని కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందారు. మరికొందరు వారసత్వ భూములను వారి పేర్లపై నమోదు చేసుకొని కొత్తగా డిజిటల్‌ పాస్‌ పుస్తకాలను పొందారు. వివిధ కారణాలతో చనిపోయిన రైతుల పేరున ఉన్న భూములు వారి కుటుంబ సభ్యుల పేర్లపై నమోదు చేయడంతో కొత్తగా పాస్‌ పుస్తకాలు వచ్చాయి.
కొన్ని బ్యాంకులు విలీనం కావడంతో ఐఎఫ్‌ఎస్సీ కోడ్లు మాత్రమే మారాయి. బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌ పాతదే ఉంటుందని అధికారులు తె లిపారు. అయితే తప్పనిసరిగా కొత్త ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌ ఇవ్వాల్సి ఉంటుం ది. ఇందుకోసం రైతులు బ్యాంకుకు వెళ్లి కొత్త పాసుపుస్తకాన్ని తీసుకోవా ల్సి ఉంటుంది. ఒకవేళ కొత్త పాసుపుస్తకాల జారీ లేకుంటే కనీసం ఇప్పటికే ఉన్న పాసుపుస్తకంపై నూతన ఐఎఫ్‌ఎస్సీ కోడ్‌ స్టాంప్‌ వేయించుకున్నా సరిపోతుంది. అలాగే గతం లో ఆధార్‌ కార్డులో ఉన్న తప్పులను సరిచేసుకోవడం తదితర సమస్యలకు సంబంధించిన ధ్రువపత్రాలను కొత్తగా జతపర్చి అప్‌డేట్‌ చేసుకునేందుకు రైతులకు అవకాశం ఉ న్నది. విలీనమైన బ్యాంకు ఖాతాదారులు మినహా.. మిగ తా వారు ఎలాంటి పత్రాలు సమర్పించవలసిన అవసరం లేదు. వివిధ సమస్యల కారణంగా ఇప్పటి వరకు రైతుబం ధు రాని రైతులూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. పట్టాదారు, బ్యాంకు పాసుపుస్తకాలు, ఆధార్‌ కార్డు ఏఈవోకు అందించాల్సి ఉంటుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సర్‌కారు తగ్గలె..సాయం ఆగలె

ట్రెండింగ్‌

Advertisement