e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జిల్లాలు గ్రామాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ అమలు

గ్రామాల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ అమలు

గ్రామాల్లో  స్వచ్ఛంద లాక్‌డౌన్‌ అమలు

దేవరకద్ర రూరల్‌/ మూసాపేట, ఏప్రిల్‌ 29: కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపత్యంలో గ్రామాలలో ప్రత్యేక లాక్‌డౌన్‌లను విదిస్తున్నారు. అందులో భాగంగా దేవరకద్ర మండలంలోని కౌకుంట్ల గ్రామంలో గురువారం నుండి లాక్‌డౌన్‌ అమలు జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలు హోటళ్లు వ్యాపారాలు నడిపి, 12 నుండి తిరిగి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు లాక్‌డౌన్‌ ఉంటున్నట్లు పంచాయతీ తీర్మాణం చేశారు. అందుకు గాను ప్రజలు, దుకాణదారులు నిబందనల ప్రకారం నడుచుకుటున్నారు. పోలీసులు రాత్రిపూట ప్రజలు బయట తిరగరాదని కర్ఫ్యూ అమలులో ఉందని ప్రజలకు కొవిడ్‌ వ్యాధి, జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా చిన్న చింతకుంట మండలంలోని లాల్‌కోట గ్రామంలో కేసులు పెరుగుతు న్న నేపథ్యంలో ఉదయం 10 గంటల వరకు వ్యాపారాలు నిర్వహించి అనంతరం దుకాణాలు మూసి స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు.
నందిపేట, జానంపేటలో..
మూసాపేట మండలంలోని నందిపేట, జానంపేట గ్రామాల్లో గ్రామ పెద్దలు, ప్రజలు సమావేశం నిర్వహించి గురువారం నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించాలని నిర్ణయం తీసుకొని పాటిస్తున్నారు. నందిపేటలో ఉద యం 6గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి సా యంత్రం 4 గంటలనుంచి 6 గంటల వరకు, జానంపేటలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. రెండు గ్రామాల్లోనూ నిర్ణయించిన సమయంలోనే వ్యాపార సముదాయాలు తెరిచి ఉంచాలని, ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాలంటే విధిగా మాస్కులు ధరించాలని గ్రామస్తులు నిర్ణయించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గ్రామాల్లో  స్వచ్ఛంద లాక్‌డౌన్‌ అమలు

ట్రెండింగ్‌

Advertisement