e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home జిల్లాలు మెరుగైన వైద్యం అందించాలి

మెరుగైన వైద్యం అందించాలి

మెరుగైన వైద్యం అందించాలి

చిరంజీవి 50 ఆక్సిజన్‌ సిలిండర్లు పంపించడం అభినందనీయం
ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
ఏనుగొండలో ‘డబుల్‌’ ఇండ్ల నిర్మాణాలు పరిశీలన
మహబూబ్‌నగర్‌ జనరల్‌ దవాఖాన సందర్శన

మహబూబ్‌నగర్‌, మే 29 : ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్‌ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంటున్నదని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని జనరల్‌ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానకు వచ్చే రోగుల సహాయకులు కూర్చునేందుకు వీలు గా నిర్మిస్తున్న షెడ్డును పరిశీలించి ఇంజనీరింగ్‌ అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. కరోనా పరీక్ష లు నిర్వహించే కేంద్రాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. దవాఖానలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఉన్నప్పటికీ.. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే ప్లాం ట్‌ను నెలకొల్పేందుకు నిర్ణయించామన్నారు. త్వరలోనే హై టెక్నాలజీతో నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్‌ను ఉ త్పత్తి చేయగలిగే సామర్థ్యం కల్గిన ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం శాంతనారాయణగౌడ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సమకూర్చిన భోజనాన్ని రోగుల కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు, అదనపు కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌పవార్‌, ప్రభుత్వ జనరల్‌ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకిషన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ.నర్సింహులు, డీఎంహెచ్‌వో కృష్ణ, డాక్టర్లు జీవన్‌, శరత్‌ తదితరులు పాల్గొన్నారు.
ఆక్సిజన్‌కు ఎంతో ప్రాముఖ్యత..
ప్రస్తుతం ఆక్సిజన్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంకు నుంచి మ హబూబ్‌నగర్‌కు వచ్చిన 50 ఆక్సిజన్‌ సిలిండర్లను అఖిల భారత చిరంజీవి యువత ఉమ్మడి జిల్లా అసోసియేషన్‌ సభ్యులు స్థానిక రెడ్‌క్రాస్‌ శాంతివనంలో మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిరంజీవి బ్లడ్‌ బ్యాంకు ద్వారా అనేక మందికి రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడారని కొనియాడారు. చిరంజీవి 50 ఆక్సిజన్‌ సిలిండర్లు పంపించడం అభినందనీయమన్నారు. ట్రస్టు ద్వారా అందజేసిన సిలిండర్లు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని, వీటిని ప్రభుత్వ జనరల్‌ దవాఖానకు అప్పగిస్తామన్నారు. చిరంజీవి యు వత రక్తదానం చేశారు. కార్యక్రమంలో భారత చిరంజీవి యువత ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజునాయక్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ శా మ్యుల్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బెక్కెం జనార్దన్‌, జిల్లా చైర్మన్‌ నటరాజ్‌, కోశాధికారి జగపతిరావు, కౌన్సిలర్‌ రాంలక్ష్మణ్‌, అఖిల భారత చిరంజీవి యువత జమ్మన్న, అష్రాఫ్‌, రఘు, కృష్ణ, శ్రీనివాస్‌, శివ, కల్యాణ్‌, హుస్సే న్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.
‘డబుల్‌’ ఇండ్లు నెల రోజుల్లో పూర్తి చేయాలి
మహబూబ్‌నగర్‌ టౌన్‌, మే 29 : జర్నలిస్టు కాలనీ వద్ద నిర్మిస్తున్న డబుల్‌బెడ్రూం ఇండ్ల శ్లాబులు నెల రో జుల్లో పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించా రు. శనివారం జిల్లా కేంద్రం సమీపంలోని ఏనుగొండలో జర్నలిస్టు కాలనీ వద్ద చేపట్టిన రెండు పడకల ఇండ్ల ని ర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రతి ఇంటిని తనిఖీ చేసి, మెటీరియల్‌ ఎలా వాడుతున్నారో క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకట్రావు, అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, గృహ నిర్మాణ శాఖ ఈఈ భాస్కర్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మెరుగైన వైద్యం అందించాలి

ట్రెండింగ్‌

Advertisement