e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home మహబూబ్ నగర్ ఆపత్కాలంలో అండగా..

ఆపత్కాలంలో అండగా..

ఆపత్కాలంలో అండగా..
  • నిస్సహాయుల ఆకలి తీరుస్తున్న దాతలు
  • బాటసారులు, అభాగ్యులకు మేమున్నామంటూ భరోసా

జడ్చర్లటౌన్‌, మే 25 : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బాటసారులు.. యాచకులకు భోజనం దొరకని పరిస్థితి.. ఈ తరుణంలో అభాగ్యులకు పలువురు దాతలు అన్నదానం చేస్తూ ఆపత్కాలంలో మేమున్నామంటూ భరోసానిస్తున్నారు. జడ్చర్లలోని ఎర్రసత్యం కాలనీకి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త ఈటే శ్రీను లాక్‌డౌన్‌ వేళ అభాగ్యులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమాన్ని మొదలెట్టాడు. ప్రతిరోజు తన ఇంటి దగ్గరే భోజనాన్ని తయారు చేసుకుని తన మిత్రులు రాంచందర్‌, నర్సింహ, శ్రీకాంత్‌, వేణు, అశోక్‌, రఘు, రాము, నాగరాజ్‌, సమీర్‌ సాయంతో పట్టణంలోని రైల్వేస్టేషన్‌, ఆర్టీసీ బస్టాండ్‌, పట్టణ ప్రధాన రహదారులపై తి రుగుతూ బాటసారులకు భోజనం అంది స్తూ వారి ఆకలి తీరుస్తున్నాడు. నిత్యం రూ.3వేలతో 70మందికి సరిపడేవిధంగా భోజన ప్యాకెట్లను తయారు చేస్తున్నానని, లాక్‌డౌన్‌ ముగిసేవరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈటె శ్రీను చెబుతున్నాడు. అదేవిధంగా మాజీ వార్డు సభ్యుడు వైజీ ప్రీతం ఆధ్వర్యంలో అన్నదా న కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్చర్లలో ని ఆర్టీసీ బస్టాండ్‌, ఫ్లైఓవర్‌ బ్రిడ్జి, కావేరమ్మపేట ప్రాంతాల్లో బాటసారులకు భోజనం, వాటర్‌ ప్యాకెట్లు అందజేశారు. కార్యక్రమం లో మాజీ వార్డు సభ్యుడు విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఎం కృష్ణారెడ్డి, రవియాదవ్‌, శ్రావణ్‌, సాయిరెడ్డి, ప్రణీత్‌ పాల్గొన్నారు.

యాచకులు, వృద్ధులకు చేయూత
చిన్నచింతకుంట మండలంలోని ప్రజల ఆరాధ్య దైవమైన కురుమూర్తి స్వామి ఆలయ పరిసరాల్లో, మెట్లపై ఉండే యాచకులు, వృద్ధులకు కొందరు యువకులు అండగా నిలుస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో భోజనం దొరక్క ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా తమవంతుగా సాయం అందిస్తున్నారు. చిన్నచింతకుంట మండలానికి చెందిన కొందరు యువకులు సోమవారం నుంచి వారికి భోజనం, పండ్లు అందజేస్తున్నారు. మంగళవారం జర్నలిస్టు బాలరాజు సహకారంతో వారికి భోజనం ప్యాకెట్లు అందజేశారు. ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి యువత, దాతలను అభినందించారు. తనవంతు సాయం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మద్దూర్‌ గ్రామానికి చెందిన వెంకటేశ్‌, చింతకుంటకు చెందిన కార్తీక్‌రెడ్డి, సురేశ్‌, ఫిరోజ్‌, కిషోర్‌ పాల్గొన్నారు.

సేవ చేయడంలోనే సంతృప్తి
ఆపదలో ఉన్న వారికి సాయం అందించడంలోనే సంతృప్తి ఉంటుందని మహరాజ్‌ యువజన సంఘం అధ్యక్షుడు రమేశ్‌ అన్నారు. మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలోని మాచన్‌పల్లి గ్రామంలో మంగళవారం కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు డ్రైఫ్రూట్స్‌ అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు నరేశ్‌, రఘు,రమేశ్‌జీ, నర్సింహులు, అంజి, శివకుమార్‌, తదితరులు ఉన్నారు.

పేదలకు బ్రెడ్లు పంపిణీ
ఆల్‌ఫైజ్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ ప్రాం తంలో పేదలకు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు జహంగీర్‌బాబా మాట్లాడుతూ లాక్‌డౌన్‌ సందర్భంగా సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆపత్కాలంలో అండగా..

ట్రెండింగ్‌

Advertisement