ఆరో వీసీగా పాలమూరు బిడ్డకే చాన్స్
దేశంలోనే తొలిసారిగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్‌కు అవకాశం
విద్య, క్రీడలఅభివృద్ధికి కృషి: వీసీ
మహబూబ్‌నగర్, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు విశ్వవిద్యాలయం వీసీగా ఎల్బీ లక్ష్మీకాంత్ రాథోడ్ నియామకమయ్యారు. నిజాం కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉన్న ఆయనకు ప్రభుత్వం వీసీగా అవకాశం కల్పించింది. రాథోడ్ సొంతూరు నారాయణపేట జిల్లా మద్దూరు మండ లం తిమ్మారెడ్డిపల్లి. తన తండ్రి హన్మ్యానాయక్ తిమ్మారెడ్డిపల్లిలో ఉన్న ప్రఖ్యాత బంజారాల ఆరాధ్యదైవ్యం గురు లోకామసన్ ఆలయం పూజారి. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు మహబూబ్‌నగర్‌లోనే రాథోడ్ విద్యాభ్యాసం సాగిం ది. డిఫ్యూటీ కలెక్టర్‌గా రిటైర్డ్ అయినతన సోదరుడు సోమ్‌నాథ్ రాథోడ్ వద్ద ఉండి చదువుకున్నారు. ప్రొఫెసర్‌గా పదకొండేండ్లకుపైగా అనుభవం ఉన్న రాథోడ్‌కు సొంత జిల్లాలోని యూనివర్సిటీలోనే వీసీగా పనిచేసేందుకు అవకాశం రావడం విశేషం. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎకనమిక్స్, ఎంపీఈడీ, పీహెచ్డీ పూర్తి చేసిన ఆయనకు విద్యబోధనలో 27ఏండ్ల అనుభం ఉంది. యూనివర్సిటీ గోల్డ్‌మెడల్ సాధించారు. రాష్ట్రస్థాయి జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. సంతోష్ ట్రోఫీలో ఫుట్‌బాల్ ఆడారు. బీజింగ్, లండన్ ఒలింపిక్స్, ప్రీ ఒలింపిక్స్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యా రు. అథ్లెట్ ద్యూతీ చంద్‌కు గోల్డ్‌మెడల్ వచ్చిన ఇటలీ వరల్డ్ యూనివర్సిటీ క్రీడల్లో ఆయన మేనేజర్‌గా పనిచేశారు. క్రీడల పరంగా 26 దేశాలు పర్యటించారు. కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో క్రీడల అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, పాలమూరు యూనివర్సిటీని విద్యాపరంగానే కాకుండా క్రీడల పరంగా అత్యున్నత స్థాయికి తీసుకువెళ్తానని వీసీ రాథోడ్ తెలిపారు. జిల్లాకు చెందిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేల సహకారంతో యూనివర్సిటీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తానన్నారు.
బయోడేటా..
పూర్తి పేరు : లోకా బావోజీ లక్ష్మీకాంత్ రాథోడ్
తల్లిదండ్రులు : దేవీభాయి, హన్మ్యానాయక్
పుట్టిన తేదీ : 15-12-1965
విద్యాభ్యాసం : 1982లో మహబూబ్‌నగర్ ఎంబీసీ హైస్కూల్లో పదో తరగతి, 1984లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, 1987లో ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో బీఏ పూ ర్తి చేశారు. ఎంఏ ఎకనమిక్స్ (1989), ఎంపీఈడీ (1992), పీహెచ్డీ (2006) ఉస్మాని యా నుంచి పూర్తి చేశారు. నిజాం కళాశాల ప్రి న్సిపాల్‌గా పనిచేస్తూ వీసీగా ఎంపికయ్యారు.
బోధన అనుభవం : ఫిజికల్ ఎడ్యుకేషన్ లెక్చరర్ (5ఏండ్లు), అసిస్టెంట్ ప్రొఫెసర్ (9 ఏండ్లు), అసోసియేట్ ప్రొఫెసర్ (3ఏండ్లు), ప్రొఫెసర్ (11ఏండ్ల 6 నెలలు).