e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home జిల్లాలు కరోనా రోగులకు ఉచిత భోజనం

కరోనా రోగులకు ఉచిత భోజనం

కరోనా రోగులకు ఉచిత భోజనం

శాంతా నారాయణగౌడ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పంపిణీ
ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డ, మే 21 : లాక్‌డౌన్‌ దృష్ట్యా ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులు, వారి సహాయకులకు శాంతా నారాయణగౌడ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం ఉచితంగా భోజనం పంపిణీ చేస్తున్నట్లు ట్రస్ట్‌ చైర్మన్‌ శ్రీహిత తెలిపారు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజనం పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీహిత మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ముగిసేవరకు తాము భోజనం అందించేందుకు సిద్ధం గా ఉన్నట్లు ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకిషన్‌, ట్రస్ట్‌ ట్రెజరర్‌ శ్రీహర్షిత, శ్రీహన్స్‌గౌడ్‌, శ్రీనిధిత్‌ గౌడ్‌, సాయికీర్తి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.
లాక్‌డౌన్‌ పర్యవేక్షణ
జిల్లా కేంద్రంలో ఎస్పీ వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు. రోడ్లపై తిరుగుతున్న వాహనదారులను ఆపి ఎందుకు బయట కు వచ్చారు.. ఎక్కడికి వెళ్తున్నారు అని ఆరా తీశారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని ఎస్పీకి మంత్రి సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, డీఎస్పీ శ్రీధర్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా రోగులకు ఉచిత భోజనం

ట్రెండింగ్‌

Advertisement