e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home జిల్లాలు రూ.1999కే సీటీ స్కాన్‌

రూ.1999కే సీటీ స్కాన్‌

రూ.1999కే సీటీ స్కాన్‌

అధిక ఫీజులు వసూలు చేస్తే సీజ్‌ చేస్తాం
ప్రైవేట్‌ దవాఖానాల్లో 20శాతం పడకలు పేద రోగులకు..
మహబూబ్‌నగర్‌ జిల్లాలో 269ప్రైవేట్‌ పడకలు సర్కారు చేతికి..
దవాఖానలపై పర్యవేక్షణకు ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌
ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌, మే 17 (నమస్తే తె లంగాణ ప్రతినిధి) : అవసరం ఉన్నా లేకపోయినా సీటీస్కాన్‌ రెఫర్‌ చేస్తూ కొం దరు డాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారని, అర్హత ఉన్న డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్‌ ప్ర కారమే సీటీస్కాన్‌ తీయాలని ప్రైవేట్‌ డ యాగ్నోస్టిక్‌ సెంటర్ల నిర్వాహకులకు మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. కరోనా తో ఎందరో నిరుపేదలు సీటీ స్కాన్‌ తీసుకునేందుకు ప్రైవేట్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్లకు వస్తున్నారని.. పేదలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా నియమిత ధరలు విధిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం మంత్రి మీ డియాతో మాట్లాడారు. కరోనా కాలంలో అనేక మంది నిరుపేదలు ఆర్థిక పరిస్థితి బాగాలేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, వారి నుంచి అధిక ధరలు వసూ లు చేయొద్దని డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, ప్రైవేట్‌ దవాఖానలకు మంత్రి చేతులెత్తి విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో సీటీ స్కాన్‌ ధరలు రూ.1,999గా నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. ఫిల్మ్‌ తో సహా రిపోర్ట్‌ కావాలంటే రూ.2,790 చెల్లించాల్సి ఉంటుందన్నారు.

పేదలకు ఇ బ్బంది లేకుండా ఉండేందుకు సీటీస్కాన్‌ ధరలను రూ.5 వేల నుంచి రూ.1999కి తగ్గించినట్లు తెలిపారు. వరంగల్‌, సిద్దిపేట, కరీంనగర్‌ జిల్లాల్లో రూ.2 వేలకు తగ్గించారని.. అదే బాటలో మనం కూడా ఉన్నామన్నారు. సోమవారం నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చాయని తెలిపారు. కొందరు వైద్యులు 30 నుంచి 40 శాతం సీటీస్కాన్‌ రెఫరల్‌ ఫీజుకు ఆశపడి అవసరం ఉన్నా లేకపోయినా డయాగ్నోస్టిక్‌ సెంటర్లకు పంపిస్తున్నారని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. క్వాలిఫైడ్‌ పల్మనాలజిస్ట్‌ మాత్రమే సీటీ స్కాన్‌ రాయాలన్నారు.

జిల్లాలో 13 దవాఖానాల్లో కరోనా వైద్యం అందుతున్నదని, వీటిలో 1,345 పడకలు ఉండగా 20 శాతం అంటే 269 పడకలు ప్రభుత్వానికి కేటాయించినట్లు మంత్రి తెలిపా రు. ప్రైవేట్‌లోని 269 పడకలు అత్యంత నిరుపేదలకు కేటాయిస్తామన్నారు. ఇంజక్షన్లు, మందుల ఫీజులు మాత్రమే వసూ లు చేయాలని తెలిపారు. ప్రైవేట్‌ దవాఖా న యాజమాన్యాలు ప్రస్తుతం నెలకొన్న ఇబ్బందికర పరిస్థితుల్లో పేదల నుంచి అత్యధిక ఫీజులు వసూలు చేసి వాళ్లను ఇబ్బందులకు గురి చేయొద్దని.. మానవత్వంతో స్పందించాలని కోరారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ద వాఖానను స్వాధీనం చేసుకొని డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపా రు. ప్రభుత్వ జనరల్‌ దవఖానాల్లో పడకలు నిండితే ప్రైవేట్‌లో ఉన్న 269 పడక లు వినియోగించుకుంటున్నామన్నారు. 2.15 లక్షల ఇండ్లల్లో ఫీవర్‌ సర్వే చేశామ ని.. కరోనా లక్షణాలు ఉన్న 7,680 మందికి కరోనా కిట్‌ అందించినట్లు తెలిపారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 23 మంది లబ్ధిదారులకు రూ.10.04 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ నందలాల్‌ పవార్‌, డీఎంహెచ్‌వో కృ ష్ణ, ప్రైవేట్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ అధ్యక్షు డు తిరుపతిరెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎంపీపీ సుధా శ్రీ ఉన్నారు.
సమిష్టి కృషితోనే నియంత్రణ..
మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డ, మే 17 : సమిష్టి కృషితోనే కరోనాను నియంత్రించగలమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ జనరల్‌ దవాఖానలో ఎమ్‌ఎస్‌ఎన్‌ ఫార్మా కంపెనీ వారు సమకూర్చిన 10 మల్టీ పారామీటర్స్‌, హైప్లో నాజర్‌ పరికరాలు, 10 ఆక్సిజన్‌ మానిటర్‌లను దవాఖాన యాజమాన్యానికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరో నా నియంత్రణలో స్వచ్ఛంద సంస్థలు, దాతలు, సేవకులు ముందుకొస్తున్నారన్నారు. జిల్లాకు చెందిన ఎంఎస్‌ఎన్‌ ల్యా బొరేటరీ వారు పరికరాలు అందించడం సంతోషకరమన్నారు. జిల్లాకు చెందిన ఎ న్నారైలు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను ఇచ్చేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డబ్బులు చెల్లించి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇండియాలో వీటి ఉత్పత్తి తక్కువగా ఉన్నందున బయటి దేశాల నుంచి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. ప్రైవేట్‌ దవాఖానలు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు కరోనా విపత్తు సమయంలో రోగుల సహాయకులకు దవాఖానల వద్ద భోజనం అందించేందుకు ముం దుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ జనరల్‌ దవాఖాన సూపరింటెండెంట్‌ రాంకిషన్‌, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ రామ్మోహన్‌, డాక్టర్‌ జీవన్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రూ.1999కే సీటీ స్కాన్‌

ట్రెండింగ్‌

Advertisement