e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home జిల్లాలు 10 తరువాత ఇంటికే ప‌రిమితం

10 తరువాత ఇంటికే ప‌రిమితం

10 తరువాత ఇంటికే ప‌రిమితం

సడలింపు వేళల్లో భారీగా రద్దీ
కరోనా కట్టడికి పోలీసుల ఉక్కుపాదం
అనవసరంగా బయటకు వస్తే చర్యలు
నాలుగు రోజులుగా లాక్‌డౌన్‌ విజయవంతం

ప్రశాంతంగా లాక్‌డౌన్‌..
మహబూబ్‌నగర్‌, మే 15 : లాక్‌డౌన్‌ ప్రశాంతమైన వాతావరణంలో కొసాగుతున్నది. శనివారం యథావిధిగా లాక్‌డౌన్‌ అమలైంది. లాక్‌డౌన్‌ మినహాయింపు సమయంలో జిల్లా కేంద్రంతోపాటు, మండల కేంద్రంలోనూ ప్రజల రద్దీ పెరుగుతున్నది. వివిధ అవసరాల నిమిత్తం జనం భారీగా వస్తుండడంతో రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ తరుణంలో లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనల మేరకు కొందరు షాపుల యజమానులు వ్యాపార సముదాయాలను మూసివేయగా, మరికొందరు పోలీసులు రంగప్రవేశం అనంతరం షాపులను మూసి వేస్తున్నారు. కాగా, లాక్‌డౌన్‌ సమయంలో కొందరు యువత ఇండ్లల్లో ఉండకుండా బయట క్రికెట్‌ ఆడుతూ కనిపించారు.
మినహాయింపులో ఉరుకులు పరుగులు..
నాగర్‌కర్నూల్‌, మే 15 : ఉదయం వెసులుబాటుసమయంలో రైతుబజార్‌, వస్త్ర, వ్యాపార, నిత్యావసర సరుకుల దుకాణాలు కిక్కిరిసి కనిపిస్తున్నా యి. మధ్యాహ్నం సమయంలో ప్రధాన కూడళ్లు ని ర్మానుష్యంగా మారుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి దవాఖానకు వచ్చినవారు మధ్యాహ్న సమయంలో భోజనాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, ఎస్పీ సాయిశేఖర్‌ ఆధ్వర్యంలో అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక శుభకార్యాలకు సైతం వెళ్లాలంటే జంకుతున్నా రు. అంత్యక్రియలకు 20మంది, శుభకార్యాలకు 50 మందికి మాత్రమే ప్రభుత్వం అనుమతినివ్వడంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటూ కార్యక్రమా లు జరుపుకొంటున్నారు.
పకడ్బందీగా ..
గద్వాల, మే 15 : జోగుళాంబ గద్వాల జిల్లా కేం ద్రంతోపాటు మండలాలు, ఆయా గ్రామాల్లో లా క్‌డౌన్‌ పకడ్బందీగా కొనసాగుతున్నది. జిల్లా, మండల కేంద్రాల్లో లాక్‌డౌన్‌ సంపూర్ణంగా కొ నసాగుతుండగా.. గ్రామాల్లో అంతంత మాత్ర మే ఉందని గ్రహించిన పోలీసులు శనివారం గ్రామాల్లో గస్తీ తిరగడంతో పూర్తిస్థాయిలో లా క్‌డౌన్‌ కొనసాగింది. మినహాయింపు వేళలో నిత్యావసర వస్తువుల కోసం జిల్లా కేంద్రానికి చేరుకోవడంతో వాహనదారులతో కిటికిటలాడింది. కూరగాయలు, కిరాణ, వస్త్ర, వ్యాపార స ముదాయాలు కిక్కిరిసాయి. నందిన్నె చెక్‌పోస్టు వ ద్ద లాక్‌డౌన్‌ తీరును ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ ప ర్యవేక్షించారు. ఉదయం 10 తర్వాత కొంత మంది ప్రజలు రోడ్లపై కనిపించడంతో పోలీసులు వారిని ఆపి బయటకు రావడానికి గల కారణాలు తెలుసుకుని వదిలేశారు.
నాలుగు రోజూ విజయవంతం..
వనపర్తి, మే 15 : లాక్‌డౌన్‌ మినహాయింపు వే ళలో ప్రజలు బయటకు వచ్చి పనులు ముగించుకొ ని వెళ్తున్నారు. ఉదయం 10 తరువాత జిల్లా కేం ద్రంలోని ప్రధాన చౌరస్తాల వద్ద, జిల్లా శివారు ప్రాంతాల్లో పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి పికెటింగ్‌ నిర్వహించారు. ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేరకు జిల్లాలో 600 మందికి పైగా పోలీసు లు, 40 మంది అధికారులు పకడ్బందీ లాక్‌డౌన్‌కు

కృషి చేస్తున్నారు. ప్రజలకు అ వగాహన కల్పిస్తున్నారు. పోలీసు లు తీసుకుంటున్న చర్యలపై ఎస్పీ అపూర్వరావు ఫోన్లో సమాచారాన్ని సేకరిస్తున్నారు. గోపాల్‌పేట, పాన్‌గల్‌ మండల కేంద్రాల్లో లాక్‌డౌన్‌ పరిస్థితులను డీఎస్పీ కిరణ్‌కుమార్‌ పరిశీలించారు. రోడ్లపైకి వస్తున్న వారిని పోలీసు లు ఆపారు. అత్యవసరమున్న వారికి పంపిం చి.. మిగతావారిని హెచ్చరించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
10 తరువాత ఇంటికే ప‌రిమితం

ట్రెండింగ్‌

Advertisement