e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home జోగులాంబ(గద్వాల్) ‘పల్లె ప్రగతి’తో తొలగిన కష్టాలు

‘పల్లె ప్రగతి’తో తొలగిన కష్టాలు

‘పల్లె ప్రగతి’తో తొలగిన కష్టాలు


ఊట్కూర్‌, జూలై 11 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడుత ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం సత్పలితాలనిస్తున్నది. పథకంలో భాగంగా అధికారులు గ్రామాల్లో పరిశుభ్రతతోపాటు విద్యుత్‌ సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించారు. పురాతన ఇనుప విద్యుత్‌ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో 150 కొత్త సిమెంట్‌ స్తంభాలను ఏ ర్పాటు చేశారు. పలు గ్రామాల్లో వేలాడుతున్న విద్యుత్‌ లైన్ల ను సరి చేశారు. దీంతో ఏండ్లుగా పేరుకుపోయిన విద్యు త్‌ సమస్యలకు పల్లె ప్రగతితో పరిష్కారం చూపారు. విద్యు త్‌ ప్రమాదాల బారిన పడకుండా తగిన ఏర్పాట్లను విద్యుత్‌ శాఖ అధికారులు చేపట్టారు. గ్రామాల్లో సింగిల్‌ ఫేస్‌ విద్యు త్‌ నియంత్రణ ఉన్న చోట మరమ్మతులు చేశారు.

సమస్యల పరిష్కారం..
గతంలో అధికారులు చేపట్టిన 30 రోజు ల ప్రణాళిక, మొదటి, రెండో, మూడో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విజ యవంతం చేశారు. ఈ నెల 1 నుంచి 10 రోజుల పాటు జరిగిన నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాలను విజయవంతంగా ముగించారు. దీం తో గ్రామాల్లో విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి సం బంధిత శాఖ అధికారులు కృషి చేశారు. ప్రతి గ్రామం లో లూజ్‌ వైర్లను సరి చేసి ప్రమాదాలకు ఆస్కారం ఉ న్న చోట మరమ్మతులు చేపట్టారు. అవసరమైన చోట స్తంభాలను ఏర్పాటు చేసి వినియోగం లేని వాటిని తొలగించారు. విద్యుత్‌ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

పంచాయతీలకు తగ్గనున్న భారం..
ప్రభుత్వం విద్యుత్‌ను ఆదా చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. అందు లో భాగంగా గ్రామాల్లో రోజంతా వెలిగే వీధి దీపాలను నియంత్రించడానికి విద్యుత్‌ అధికారులు ప్ర త్యేక చర్యలు తీసుకున్నారు. ఓ వైపు గ్రామాల్లో అభివృద్ధి పనులు, మరో వైపు విద్యుత్‌ సమస్యలను పరిష్కరించి ప్రధాన వీధుల వద్ద మూడో విద్యుత్‌ లైన్‌కు ఆన్‌ ఆఫ్‌ స్విచ్‌లను ఏర్పాటు చేశారు. కేవ లం రాత్రి వేళ మాత్రమే వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవడంతో పంచాయతీలకు విద్యుత్‌ బిల్లుల భారం తగ్గుతున్నది. మండలంలో 23 గ్రామ పంచాతీయలు ఉండగా పలు చోట్ల వీధి దీపాలకు ప్రత్యేక లై న్లు లేక నిరంతం వెలుగుతూనే ఉండేవి. దీం తో ప్రభుత్వం పంచాయతీలకు మంజూరు చేస్తున్న ఆర్థిక సంఘం నిధుల్లోంచి 15 శాతం మాత్రమే విద్యుత్‌ బిల్లులు చెల్లించాలనే నిబంధన ఉంది. కానీ బిల్లులు లేకపోవడంతో సర్పంచులు ఆందోళన చెందారు. ఈ పరిస్థితి నుంచి బయట పడేందుకు విద్యుత్‌ అధికారులు, ట్రాన్స్‌కో సిబ్బంది సమన్వయంతో గ్రామాల్లో విద్యుత్‌ లైన్‌ మంజూరు చేయడంతో పనులను వేగంగా పూర్తి చేశారు. దీంతో పంచాయతీలకు బిల్లుల మోత నుంచి ఉపశమనం లభించింది.

ప్రజలు సహకరించాలి…
పల్లె ప్రగతి నాలుగో విడుతలో భాగంగా మండలంలోని ప్రతి గ్రామంలో ఇనుప స్తంభాలను గుర్తించి వాటి స్థానంలో 150 కొత్త సిమెంట్‌ స్తంభాలను ఏర్పాటు చేశాం. 75 చోట్ల లూజ్‌ వైర్లు, 85 ఎర్తింగ్‌ వైర్లను ఏర్పాటు చేయించాము. రానున్న రోజుల్లో మరిన్ని స్తంభాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. ప్రజలు సైతం అధికారులకు సహకరించాలి. విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నాం.

  • వెంకటేశ్‌, విద్యుత్‌ ఏఈ, ఊట్కూర్‌ మండలం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘పల్లె ప్రగతి’తో తొలగిన కష్టాలు
‘పల్లె ప్రగతి’తో తొలగిన కష్టాలు
‘పల్లె ప్రగతి’తో తొలగిన కష్టాలు

ట్రెండింగ్‌

Advertisement