e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home జోగులాంబ(గద్వాల్) మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
  • గ్రామాలను హరితవనాలుగా తీర్చిదిద్దాలి
  • పల్లెప్రగతి పనులు నిరంతరం కొనసాగించాలి
  • అదనపు కలెక్టర్‌ సీతారామారావు

రాజాపూర్‌, జూలై 10 : నాటే ప్రతి మొక్కనూ సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు కలెక్టర్‌ సీతారామారావు అన్నారు. శనివారం మండలకేంద్రంతోపాటు, నర్సింగ్‌ తండాలో పల్లెప్రగతి పనులను పరిశీలించి మొక్కలు నాటారు. అనంతరం తండాలో వైకుంఠధామం, డంపింగ్‌యార్డు నిర్మాణాలకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. గ్రామాల పరిశుభ్రత కోసం పల్లెప్రగతి పనులను నిరంతరం కొనసాగించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుశీల, తాసిల్దార్‌ శంకర్‌, ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంపీవో వెంకట్రాములు, సర్పంచ్‌ బచ్చిరెడ్డి, నరహరి తదితరులు పాల్గొన్నారు.

పట్టణప్రగతి నిరంతర ప్రక్రియ
పట్టణప్రగతి కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు అన్నారు. శనివారం పలు వార్డుల్లో పర్యటించి పట్టణప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటి ఆవరణను హరితమయంగా తీర్చిదిద్దిన యజమానులను సన్మానించారు. 37వ వార్డులో మొక్కలను పంపి ణీ చేశారు. అదేవిధంగా మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ తాటి గణేశ్‌, కౌన్సిలర్లు ప్రవీణ్‌కుమార్‌, ఆనంద్‌గౌడ్‌, అనంతరెడ్డి, వనజ ఆయా వార్డుల్లో ప్రత్యేకాధికారులతో కలిసి పలువురిని సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ స్వప్న, పీపీ విక్రమ్‌దేవ్‌, నాయకులు సాయిలుయాదవ్‌, లక్ష్మణ్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

మైనార్టీ గురుకులంలో..
హరితహారంలో భాగంగా జిల్లాకేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల ఆవరణలో మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి శంకరాచారి మొక్క లు నాటారు. కార్యక్రమంలో ఆర్‌ఎల్‌సీ జమీల్‌అహ్మద్‌, విజిలెన్స్‌ అధికారి అబ్దుల్‌సమద్‌, ప్రిన్సిపా ల్స్‌ బుష్రఫాతిమా, శ్రీదేవి, సురేఖ, లుబ్నా, వహీదాఅలీ తదితరులు పాల్గొన్నారు.

కాలుష్యం తగ్గించాలి
ప్రతి ఇంటి ఆవరణలో ఆరు మొక్కలు నాటి వాతావరణంలో కాలుష్యం తగ్గించాలని జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి సూచించారు. అడ్డాకుల మండలం చౌడాయిపల్లి గ్రామంలో మొక్కలు పంపిణీ చేశా రు. అనంతరం గ్రామస్తులతో కలిసి మొక్కలు నా టారు. అలాగే మహిళా సంఘం భవన నిర్మాణానికి రూ.3లక్షల ప్రొసీడింగ్‌ను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో మంజుల, సర్పంచ్‌ శ్రీకాం త్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌గౌడ్‌, శ్రీనివాస్‌యాదవ్‌, చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భాగస్వాములు కావాలి
హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ కాంతమ్మ, జెడ్పీటీసీ శశిరేఖ అన్నారు. మండలంలోని వెలుగోముల, కొత్తూర్‌, మల్లాపూర్‌, బోయిన్‌పల్లి తదితర గ్రామాల్లో మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచు లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కారం
పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ అన్నారు. దేవరకద్ర, కౌకుంట్ల గ్రామాల్లోని రైతువేదికల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ సుజాత, సర్పంచులు కొండా విజయలక్ష్మి, స్వప్న, ఏడీఏ యశ్వంత్‌రావు, ఏవో రాజేందర్‌ అగర్వాల్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ కీర్తి, ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంపీవో విఘ్నేశ్‌, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండారెడ్డి, పీఏసీసీఎస్‌ డైరెక్టర్‌ కృష్ణగోపాల్‌, మాజీ ఎంపీపీ ఈవీ గోపాల్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, భాస్కర్‌రెడ్డి, కిషన్‌రావు, రవి తదితరులు పాల్గొన్నారు.

పల్లెప్రగతి పనులు పరిశీలన
జడ్చర్ల మండలంలోని కిష్టారం, ఖానాపూర్‌, పోలేపల్లి, తదితర గ్రామా ల్లో జెడ్పీ వైస్‌చైర్మన్‌ యాదయ్య, సీఈవో జ్యోతి పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. అదేవిధంగా పలు గ్రామాల్లో కార్మికులను సన్మానించారు. హరితహారంలో భాగంగా మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్‌ చైర్మ న్‌ సుదర్శన్‌గౌడ్‌, ఎంపీడీవో స్వరూప, ఎంపీవో జగదీశ్‌, సర్పంచులు నర్సింహులు, చేతనారెడ్డి, అరుణమ్మ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఏఈ జవహర్‌బాబు, మాల్యానాయక్‌ పాల్గొన్నారు.

జడ్చర్ల మున్సిపాలిటీలో..
జడ్చర్ల మున్సిపాలిటీలో పట్టణప్రగతి పనులను మున్సిపల్‌ కమిషనర్‌ సునీత పరిశీలించారు. అలాగే జడ్చర్ల-మహబూబ్‌నగర్‌ జాతీయ రహదారికి ఇరువైపులా మొక్క లు నాటారు. పట్టణప్రగతిలో భాగంగా 10రోజులుగా మున్సిపాలిటీలోని 27 వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించారు. చివరిరోజు బూరెడ్డిపల్లి వార్డులో కౌన్సిలర్‌ ఉమాదేవీవెంకటేశ్‌ ఆధ్వర్యంలో ఇంటి ఆవరణలో మొక్కలను ఏపుగా పెంచిన గ్రామస్తులను సన్మానించారు.

పారిశుధ్యం లోపించకుండా చూడాలి
గ్రామాల్లో పారిశు ధ్యం లోపించకుండా చూడాలని డీసీవో, మండల ప్రత్యేకాధికారి సుధాకర్‌ కోరారు. మండలంలోని ఇప్పటూర్‌, చెన్నారెడ్డిపల్లి, యన్మన్‌గండ్ల, నవాబ్‌పేట గ్రామాల్లో నిర్వహించిన పల్లెప్రగతి గ్రామసభలకు ప్రత్యేకాధికారి హాజరై మాట్లాడారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. హరితహారంలో ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, ఎంపీడీవో శ్రీల త, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ డీఎన్‌ రావు, ఏపీవో జ్యోతి, సర్పంచులు గోపాల్‌గౌడ్‌, గౌసియాబేగం, యాదయ్య, జయమ్మ, ఎంపీటీసీలు రాధాకృష్ణ, లక్ష్మీబాయి, ఉపసర్పంచ్‌ రవికిరణ్‌, నాయకులు అబ్దుల్లా, నవనీతరావు, పంచాయతీ కార్యదర్శులు సురేందర్‌, దీప్తి, కల్పన పాల్గొన్నారు.

పల్లెప్రగతితో గ్రామాలు అబివృద్ధి
పల్లెప్రగతితో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. గండీడ్‌ మండలంలోని పెద్దవార్వల్‌, సాలార్‌నగర్‌లో నిర్వహించిన పల్లెప్రగతి గ్రామసభలకు హాజరై మాట్లాడారు. అదేవిధంగా మహ్మదాబాద్‌ మండలంలోని ధర్మాపూర్‌, కొలిమికుచ్చతండా ల్లో ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. సమావేశాల్లో గండీడ్‌ మండల ప్రత్యేకాధికారి దశరథ్‌, ఎంపీవో శంకర్‌నాయక్‌, వైస్‌ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్‌, సర్పంచులు లలితారెడ్డి, సత్యమ్మ, బాలాజీ, నర్సమ్మ, నాయకుడు బొక్క రాములు ఉన్నారు.

దత్తత తీసుకోవాలి
ప్రతి విద్యార్థీ మొక్కలను దత్తత తీసుకొని సంరక్షించాలని టీఎన్‌జీవోఎస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజీవ్‌రెడ్డి, చంద్రనాయక్‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతిగృహం ఆవరణలో మొ క్కలు నాటారు. కార్యక్రమంలో హెచ్‌డబ్ల్యూవో రవికుమార్‌, తిరుపతయ్య పాల్గొన్నారు.

కార్మికులకు సన్మానం
మండలంలోని వాయిల్‌కుంటతండాలో పల్లెప్రగతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న కార్మికులను సర్పంచ్‌ గోపీనాయక్‌ ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పెద్దాయపల్లి, ఊటకుంటతండా, జాలుగడ్డతండా, నామ్యాతండా, పెద్దబాయితండా తదితర గ్రామాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు తిరుపతినాయక్‌, ప్రధాన కార్యదర్శి శంకర్‌, సర్పంచులు పీర్యానాయక్‌, లలితామంజునాయక్‌, గంగారవినాయక్‌, పంచాయతీ కార్యదర్శులు అనిల్‌కుమార్‌, బాషూనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

హన్వాడ మండలంలో..
మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో పారిశుధ్య పనులు చేపట్టడంతోపాటు మొక్కలు నాటారు. పల్లెప్రగతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న వారిని శాలువాలతో సన్మానించి అభినందించారు. కొనగట్టుపల్లి గ్రామంలో డీపీవో వెంకటేశ్వర్లు పర్యటించి పల్లెప్రగతి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత

ట్రెండింగ్‌

Advertisement