e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జిల్లాలు సేవాభావం అలవర్చుకోవాలి

సేవాభావం అలవర్చుకోవాలి

సేవాభావం అలవర్చుకోవాలి

ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
జనరల్‌ దవాఖానలో కార్మికులకునిత్యావసర సరుకులు పంపిణీ

మహబూబ్‌గర్‌, జూన్‌ 4 : ప్రతిఒక్కరూ కష్టకాలంలో సేవ చేయడం అలవాటు చేసుకోవాలని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ దవాఖాన కరోనా వార్డులో పనిచేస్తున్న కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా సమయంలో స్వీపర్లు, మహిళా కార్మికులు, వార్డు బాయ్స్‌ సేవలకుగానూ రైస్‌మిల్లర్లు తమవంతు సాయం చేసేందు కు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. 120మందికి 25కిలోల బియ్యం, కిలో కందిపప్పు, గోధుమపిండి, మంచినూనె తదితర సరుకులను అందజేసినట్లు తెలిపారు. మరో 100మందికి నిత్యావసర సరుకులు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రైస్‌ మిల్లర్స్‌ సంఘం కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సీతారామారావు, జనరల్‌ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకిషన్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ జీవన్‌, డాక్టర్‌ కిరణ్‌, ఆర్డీవో పద్మశ్రీ పాల్గొన్నారు.
స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుదాం
మహబూబ్‌నగర్‌టౌన్‌, జూన్‌ 4 : మహబూబ్‌నగర్‌ ను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మున్సిపాలిటీలో చెత్త సేకరణకు నూతనంగా మంజూరైన రెండు ట్రాక్లర్లు, ఒక డోజర్‌, నాలుగు ఆటోలను మున్సిపల్‌ కార్యాలయంలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ మహబూబ్‌నగర్‌ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధిపర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా రహదారుల విస్తరణ, కూడళ్ల అభివృద్ధితోపాటు, పార్కుల సుందరీకరణ తదితర పనులు చేపడుతున్నామని తెలిపారు. జడ్చర్ల-మహబూబ్‌నగర్‌ నాలు గు లేన్ల రహదారి, బైపాస్‌రోడ్డు, నూతన కలెక్టరేట్‌ భవన నిర్మాణాలతోపాటు మినీ ట్యాంక్‌బండ్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అనంతరం 9వ వార్డు పాల్కొండలో రూ.3లక్షల 80వేలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, వైస్‌చైర్మన్‌ తాటి గణేశ్‌, కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌, కౌన్సిలర్లు రామ్‌, నరేందర్‌, గోవిందు, సీఐ మహేశ్వర్‌రావు, ఎస్సై రమేశ్‌, మోసీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సేవాభావం అలవర్చుకోవాలి

ట్రెండింగ్‌

Advertisement