e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home జిల్లాలు కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి

కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి

కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి

24 గంటలపాటు సిబ్బంది అందుబాటులో ఉండాలి
15 నాటికి కేసులు పెరిగే అవకాశం
దాతల సాయంతో బాధితులకు పండ్లు పంపిణీ చేయాలి
వీసీ ద్వారా మండల అధికారులతో కలెక్టర్‌ వెంకట్రావు

మహబూబ్‌నగర్‌, మే 1 : జిల్లా వ్యాప్తంగా అన్ని మం డల కేంద్రాల్లో కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకుగానూ తాసిల్దార్లు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ నుంచి వీసీ ద్వా రా మండల అధికారులతో ఆయన మాట్లాడారు. జిల్లాలో గత నెల 30న బాలానగర్‌, కోయిలకొండ, దేవరకద్ర మం డల కేంద్రాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రారంభించిన కేంద్రాల్లో 24 గంటలపాటు సి బ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ నెల 15 నాటికి కేసులు పెరిగే అవకాశం ఉన్నదని, ముందస్తుగా మండల కేంద్రాల్లోనూ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. దాతల సాయంతో బాధితులకు పండ్లు, ఇతర సామగ్రి అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ధరణి ద్వారా నిర్వహిస్తున్న భుముల లావాదేవీలకు సంబంధించి ప్రస్తుతం జిల్లాలో ఎటువంటి సమస్యలు లేనప్పటికీ తాసిల్దార్లు పూర్తి జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీఆర్‌వోలను ధరణిలో భాగస్వాములను చేయకూడదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 190 ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 118 ప్రారంభించినట్లు చెప్పారు. ప్రజలు పూర్తిస్థాయిలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ముం దుకు సాగాలన్నారు. నూతనంగా ఏర్పాటైన మహ్మదాబా ద్‌ మండలంలోని మండల కాంప్లెక్స్‌లో ముఖ్యమైన విభాగాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 15 రోజులపాటు టీఎస్‌ఎండీసీకి ఇచ్చిన అనుమతులు, మ న ఇసుక వాహనం ద్వారా ఇచ్చిన అ నుమతులు తప్పా ఎలాంటి ప్రభుత్వ పనులకు ఇసుక రవాణా చేయడానికి వీలు లేదన్నారు. ఎవరైనా ఇసుకను అ క్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. ప్రతి విషయంలోనూ పారదర్శకంగా ముందు కు సాగాలని, ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండాప్రజలకు అధికారులు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. సమావేశంలో అధికారులు తదిత రులు పాల్గొన్నారు.
ప్రతి కేసు క్షుణ్ణంగా పరిశీలన
ప్రత్యేక ట్రిబ్యునల్‌లో జారీ చేసిన ఉత్తర్వులపై సదరు కే సులను ఓపెన్‌ చేసి పిటీషన్లు పెట్టుకునే వెసులుబాటును ప్ర భుత్వం కల్పించిందని, ఈ కేసులను క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు కలెక్టర్‌ వెంకట్రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ నుంచి కేసులకు సంబంధించి వెబ్‌నార్‌ను ఆయ న నిర్వహించారు. ఆన్‌లైన్‌ ద్వారా సు మారు 30 కేసులకు సంబంధించి పునరాజ్యం నిర్వహించినట్లు కలెక్టర్‌ తెలిపా రు. ఆర్‌వోఆర్‌ కేసులకు సంబంధించి ఇది వరకు నిర్వహించిన ప్రత్యేక ట్రిబ్యునల్‌ ద్వారా జారీ చేసిన ఉత్తర్వులపై పిల్‌లో హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి పునర్వజ్యానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. అందులో భాగంగా గత నెల 15, 24,28 తేదీల్లో ట్రిబ్యునల్‌ కేసులపై వెబ్‌నార్‌ ని ర్వహించినట్లు చెప్పారు. 24న 30 కేసులు, 28న 30 కేసులపై పునర్వజ్యాన్ని విన్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్‌ సీతారామారావు, న్యాయవాదులు పా ల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి

ట్రెండింగ్‌

Advertisement