e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిల్లాలు ఫీవర్‌ సర్వే పక్కాగా చేపట్టాలి

ఫీవర్‌ సర్వే పక్కాగా చేపట్టాలి

ఫీవర్‌ సర్వే పక్కాగా చేపట్టాలి

జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కృష్ణ
గంగాపూర్‌ పీహెచ్‌సీ తనిఖీ

జడ్చర్ల, మే 31 : ఇంటింటి ఫీవర్‌ సర్వేను పక్కాగా చే పట్టాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని గంగాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. మండలంలో చేపట్టిన ఫీవర్‌ సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పీహెచ్‌సీ లో కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్‌ వివరాలపై ఆరా తీశారు. కరోనా పరీక్షలకు వచ్చే వారందరికీ పరీక్షలు నిర్వహించాల ని డాక్టర్‌ సమతకు సూచించారు. ఫీవర్‌ సర్వేలో ప్రతి ఇం టికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకోవాలన్నారు. అలాగే ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వారు బయటకు వెళ్లకుండా చూడాలన్నారు. గంగాపూర్‌ పీహెచ్‌సీ పరిధిలో మొత్తం 2150 ఇండ్లను సర్వే చేసినట్లు డాక్టర్‌ సమత తె లిపారు. సర్వేలో 77 మందికి లక్షణాలు ఉన్నాయని గుర్తిం చి మెడికల్‌ కిట్లు అందజేసినట్లు ఆమె పేర్కొన్నారు.
సర్వే పరిశీలన
జడ్చర్ల మున్సిపాలిటీలోని 24వ వార్డులో ఫీవర్‌ సర్వేను కౌన్సిలర్‌ కోట్ల ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. వైద్య సిబ్బంది తో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలను తె లుసుకున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి మెడికల్‌ కిట్ల ను అందజేశారు. అదేవిధంగా 7వ వార్డులోని బూరెడ్డిపల్లి లో వైద్య సిబ్బంది ఫీవర్‌ సర్వే నిర్వహించారు. కార్యక్రమం లో ఆశ కార్యకర్త లత, ఆర్పీ శశికళ పాల్గొన్నారు.
ప్రజలు సహకరించాలి
మహబూబ్‌నగర్‌ టౌన్‌, మే 31 : కరోనా కట్టడికి ప్రభు త్వం చేపట్టిన ఫీవర్‌ సర్వేకు ప్రజలు సహకరించాలని ము న్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు కోరారు. జిల్లా కేంద్రంలో ని హౌసింగ్‌బోర్డు కాలనీ, ఎదిరలో మున్సిపల్‌ చైర్మన్‌, 46 వ వార్డులో వైస్‌ చైర్మన్‌ గణేశ్‌ ఫీవర్‌ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, మున్సిపల్‌ సిబ్బంది ప్రతి ఇంటికీ వస్తారని, ప్రజలు తమ ఆరోగ్య పరిస్థితిని తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌, కౌన్సిలర్లు రామాంజనేయులు, యాదమ్మ, నాయకులు హన్మంతు, మున్సిపల్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి
హన్వాడ, మే 31 : ప్రతిఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్ర త్యేక శ్రద్ధ తీసుకోవాలని పలు గ్రామాల సర్పంచులు సూ చించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్ర జా ప్రతినిధులతో కలిసి వైద్య సిబ్బంది ఫీవర్‌ సర్వే నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే కరోనా బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇంటింటి సర్వే
రాజాపూర్‌, మే 31 : మండలంలోని అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది మూడో విడుత ఫీవర్‌ సర్వే నిర్వహించారు. ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్యంపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రతాప్‌చౌహాన్‌ మా ట్లాడుతూ ప్రజలకు జ్వరం ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. కార్యక్ర మంలో వైద్య సిబ్బంది, ఆర్పీలు ఉన్నారు.
వేగంగా ఫీవర్‌ సర్వే
జడ్చర్ల టౌన్‌, మే 31 : కరోనా వ్యాప్తి నివారణకు ప్రభు త్వం చేపడుతున్న ఇంటింటి ఫీవర్‌ సర్వేలో భాగంగా జడ్చర్లలో మూడో విడుత సర్వే ప్రారంభమైంది. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, ఆర్పీ లు ఇంటింటికెళ్లి సర్వే చేపడుతున్నట్లు అర్బన్‌ హెల్త్‌సెంటర్‌ డాక్టర్‌ శివకాంత్‌ తెలిపారు.
పలు వార్డుల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మి, కమిషనర్‌ సునీత వైద్య సిబ్బందితో కలిసి ఇంటింటికెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అదేవిధంగా ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు వైద్య సిబ్బందితో కలిసి ఇంటింటి సర్వేలో పాల్గొన్నారు. సర్వేలో భాగంగా జ్వరం, దగ్గు, జలుబు తదితర అనారోగ్య సమస్యలతో బా ధపడుతున్న వారిని గుర్తించి ఇంటి దగ్గరే మందులను అం దించారు. ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరారు. కరోనా బాధితులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటామని కౌన్సిలర్లు భరోసానిచ్చారు.
పకడ్బందీగా నిర్వహించాలి
మిడ్జిల్‌, మే 31 : కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి ఫీవర్‌ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జెడ్పీ సీఈవో జ్యోతి అన్నారు. మండలంలోని బోయిన్‌ప ల్లి, మిడ్జిల్‌ గ్రామాల్లో సర్వేను పరిశీలించారు. ఈ సందర్భం గా సీఈవో మాట్లాడుతూ ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే సర్వే బృందానికి తెలియజేయాలని సూచించారు. అనంతరం బోయిన్‌పల్లిలో పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డీఎంవో విజయకుమార్‌, తాసిల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో సా యిలక్ష్మి, డాక్టర్‌ వంశీప్రియ, ఎంపీవో అనురాధ, సర్పంచులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కుటుంబ సభ్యుల వివరాలు సేకరణ
బాలానగర్‌, మే 31 : మండలంతోపాటు నామ్యాతండాలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఫీవర్‌ సర్వే నిర్వహించారు. సర్వేలో కుటుంబ సభ్యుల వివరాలు సేకరించడంతోపాటు ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే మందులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఫీర్యానాయక్‌, పంచాయతీ కార్యదర్శి అన్నపూర్ణదేవి, కృ ష్ణ, అంగన్‌వాడీ టీచర్లు సుజాత, రాజేశ్వరి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఫీవర్‌ సర్వే పక్కాగా చేపట్టాలి

ట్రెండింగ్‌

Advertisement