e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home జిల్లాలు ఇక ‘సూపర్‌' వైద్యం

ఇక ‘సూపర్‌’ వైద్యం

ఇక ‘సూపర్‌' వైద్యం

వనపర్తి, నాగర్‌కర్నూల్‌కు మెడికల్‌ కళాశాలలు
చెంతనే సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు
పాలమూరుకు నర్సింగ్‌ కళాశాల
నల్లమల వాసులకు వరంగా వైద్యవిద్య
మంత్రుల కృషికి కృతజ్ఞతలు చెబుతున్న ప్రజలు
మహబూబ్‌నగర్‌, మే 31 (నమస్తే తెలంగాణ ప్రతిని
ధి) : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు ప్రభు త్వ మెడికల్‌ కళాశాలలతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జి ల్లా సూపర్‌ స్పెషాలిటీ వైద్యానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారనున్నది. సమైక్య పాలనలో వైద్యం కోసం పడిన కష్టాలకు చెక్‌ చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఉమ్మడి జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌కు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను మంజూరు చేసింది. తాజాగా మరో రెండు మెడికల్‌ కళాశాలలను మంజూరు చేస్తూ పాలమూరు వాసులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత చేరువ చేసిం ది. మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కళాశాల పరిధిలో ఉన్న ప్రభుత్వ జనరల్‌ దవాఖాన ద్వారా ఉమ్మడి జిల్లా మొత్తానికి అధునాతన వైద్య సేవలు అందుతున్నాయి. ప్రస్తు తం కరోనా మహమ్మారి వేధిస్తున్న తరుణంలో అన్ని ప్ర భుత్వ దవాఖానల్లో సదుపాయాలు పెంచుతున్నది. అ యితే ఉమ్మడి జిల్లా పరిధిలో కేవలం ఒకే ఒక ప్రభుత్వ కళాశాల మాత్రమే ఉండగా.. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో రెండు మెడికల్‌ కళాశాలలు మంజూరయ్యాయి. వైద్య కళాశాలలతోపాటు నాగర్‌కర్నూల్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌కు రీజినల్‌ సబ్‌ సెంటర్లు సైతం కే టాయించింది. రీజినల్‌ సబ్‌ సెంటర్ల ఏర్పాటుతో వాటి పరిధిలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు యుద్ధప్రాతిపదికన మందులు అందించడానికి చక్కని అవకాశం ఏ ర్పడుతుంది. మరోవైపు మహబూనగర్‌ మెడికల్‌ కళాశాలకు నర్సింగ్‌ కళాశాల సైతం మంజూరు చేయడంతో వై ద్యంలో ఉమ్మడి జిల్లా మరింతగా అభివృద్ధి చెందనున్న ది. మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ ఎప్పటికప్పు డు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలమూరు పరిస్థితిని వివరిస్తూ ప్రజలకు వైద్యం చేరువ చేసేందుకు తమ వంతు కృషి చేశారు.
డబుల్‌ బొనాంజ..
వనపర్తికి మెడికల్‌ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ఈ నెల 17న ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో తమకు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయ ని వనపర్తి జిల్లా వాసులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తాజాగా ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లాకు సై తం మెడికల్‌ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తు తం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని జనరల్‌ దవాఖాన మహబూబ్‌నగర్‌తో పాటు నారాయణపేట జిల్లాల ప్రజలకు పూర్తిగా.. నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల పరిధిలోని వారికి కొంతమేర అందుబాటులో ఉంటుంది. ఇ ప్పుడు వనపర్తిలో ఏర్పాటు చేయనున్న మెడికల్‌ కళాశాలతోపాటు ఏర్పాటు చేసే జనరల్‌ దవాఖాన వనపర్తి జి ల్లాతో పాటు జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలోని వారికి వైద్య సేవలు మరింత బాగా అందించేందుకు వీలవుతుంది. ఇక నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన మెడికల్‌ కళాశాలతో వచ్చే జనరల్‌ దవాఖానతో జిల్లా వాసులకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి.
వైద్య కళాశాల రాకతో..
మెడికల్‌ కాలేజీ వస్తే అందుకు అనుగుణంగా ప్రొఫెస ర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ఇతర సూపర్‌ స్పెషాలిటీ వై ద్యులు అందుబాటులోకి రానున్నారు. ప్రస్తుతం ఉన్న జి ల్లా దవాఖానలు సూపర్‌ స్పెషాలిటీ జనరల్‌ దవాఖానలుగా మారనున్నాయి. కమ్యూనిటీ మెడిసిన్‌, జనరల్‌ మె డిసిన్‌, పీడియాట్రిక్‌, పల్మనాలజీ, ఆర్థ్రోపెడిక్స్‌, డెంటల్‌, ఈఎన్టీ, గైనిక్‌, అనెస్తేసియా, రేడియాలజీ, జనరల్‌ సర్జరీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, సైకాలజీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ వంటి విభాగాలు అందుబాటులోకి వస్తాయి. అధునాతన ల్యాబ్‌ తదితర సౌకర్యాలు సౌకర్యం అందుబాటులోకి వస్తాయి. కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ వెళ్లి వైద్యం చే యించుకునే దుస్థితి స్థానికులకు తప్పుతుంది. తూతూమంత్రంగా వైద్యం అందిస్తూ లక్షలు గుల్ల చేసే ప్రైవేట్‌ వైద్యం దందాకు బ్రేకులు పడనున్నాయి.
నల్లమల వాసులకు వరం..
అతి పెద్ద జిల్లా అయిన నాగర్‌కర్నూల్‌లోని నల్లమల అటవీ ప్రాంతంలో నివాసం ఉండే చెంచులు, ఇతర గిరిజనులు మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌ రావాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సి వస్తున్నది. దోమలపెంట, నల్లమలలోని మద్దిమడుగు నుంచి మహబూబ్‌నగర్‌కు సుమారు 160 కి.మీ ప్రయాణించా ల్సి ఉంటుంది. అంత దూరం నుంచి వచ్చేందుకు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇక చెంచులు అడవిలో గంటల కొద్ది నడిచి మన్ననూరు వచ్చి అక్కడి నుంచి బ స్సుల్లో మహబూబ్‌నగర్‌ రావాలంటే ఊహించడమే క ష్టం. వైద్యం అందనంత దూరం కావడం వల్లే అనేక మం ది దవాఖానకు వస్తూ మార్గమధ్యంలో చనిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ తరుణంలో మెడికల్‌ కళాశాల మంజూరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇక ‘సూపర్‌' వైద్యం

ట్రెండింగ్‌

Advertisement