e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home మహబూబ్ నగర్ Jadcherla | ప్రకృతి రమణీయత పెంచేలా ల్యాండ్‌స్కేప్‌లు: మహబూబ్‌నగర్ కలెక్టర్

Jadcherla | ప్రకృతి రమణీయత పెంచేలా ల్యాండ్‌స్కేప్‌లు: మహబూబ్‌నగర్ కలెక్టర్

జడ్చర్ల టౌన్: మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లోని అన్ని కూడళ్లలో ప్రకృతి రమణీయతను పెంచేలా ల్యాండ్ స్కేప్‌లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ చెప్పారు. మంగళవారం జడ్చర్ల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని జాతీయ రహదారి ఫ్లెఓవర్ బ్రిడ్జి కూడలిని ఆయన ఆకస్మికంగా తనీఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్చర్ల ైఫ్లెఓవర్ బ్రిడ్జి కూడలిలో పచ్చద నం, గార్డెనింగ్ పెంచాలని, ల్యాండ్ స్కేప్ ఏర్పాటు చేయాలని, గోడలకు పెయింటింగ్ చేయించి, ఇండోర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ సునీతను ఆదేశించారు.

అలాగే జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ వెళ్లే రహదారికి ఇరువైపులా నాలుగు వరుసల్లో మొక్కలు నాటాలని సూచించా రు. అంతేకాకుండా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని రహదారులకు ఇరువైపులా నాలుగు వరుసల్లో మొక్కలు నాటాలని, పట్టణంలోని అన్ని పార్కులను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు.

- Advertisement -

ఈనెల15న జడ్చర్లలో వినాయక నిమజ్జనం దృష్ట్యా ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, ప్రధానంగా వినాయక నిమజ్జనం కోసం అవసరమైన క్రేన్లను ఏర్పాటు చేయాలన్నారు. జడ్చర్ల, మహబూబ్‌నగర్, భూత్పూర్, మున్సిపల్ పట్ట ణ ప్రాంతాల్లోని అన్ని కూడళ్ల అభివృద్ధితో పాటు, సుందరీకరణ పనులను పూర్తి చేయాలని, ల్యాండ్ స్కేప్‌లు ఏర్పాటు చేయాలన్నారు.

జంక్షన్ల అభివృద్ధితో పాటు ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా నియంత్రించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జడ్చర్ల ైఫ్లెఓవర్ బ్రిడ్జి వద్ద గార్డెనింగ్ ఏర్పాటుపై ఆకస్మికంగా తనీఖీ కోసం వచ్చిన కలెక్టర్ ఎలాంటి ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ఓ ప్రైవేటు కారులో డ్రైవర్‌తో కలసి ఒక్క డే రావటంతో అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు అవాక్కయ్యారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana