దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 30 : దేవరకద్ర, కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలాల్లో శుక్రవారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరకద్ర మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రమాదేవి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం స్థానిక దవాఖానలో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. కౌకుంట్లలో టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. చిన్నచింతకుంట ఎంపీపీ హర్షవర్దన్‌రెడ్డి ముచ్చింతల దుర్గామాత మండపంలో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం మండలకేంద్రంలో కేక్ కట్ చేశారు. మద్దూరులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
అనాథాశ్రమంలో అన్నదానం
మూసాపేట, సెప్టెంబర్ 30 : ఎమ్మెల్యే ఆల పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్ జిల్లా కేంద్రంలోని అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజ నం చేశారు. అలాగే మండలకేంద్రంలో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ గూపని కళావతీకొండయ్య, వెంకటేశ్వర్‌రెడ్డి, శివరాములు, అనిల్‌కుమార్‌రెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, రవీందర్‌గౌడ్, కృష్ణయ్యగౌడ్, ఆంజనేయులు, కేశవులు, విజ య్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలో..
అడ్డాకుల మండలకేంద్రంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే కాటవరం గ్రామానికి చెందిన దివ్యాంగుడు వడ్డె రఘునాథ్‌కు ఎమ్మెల్యే ఆల చేతులమీదుగా జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి స్కూటీని అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ జి తేందర్‌రెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యుడు మహమూద్, కోఆప్షన్ సభ్యుడు ఖాజాగోరి, పొ న్నకల్ సలీంపాషా, రమేశ్‌గౌడ్, బాలరాజు, దానేలు, శ్రీనివాసులు, రమేశ్ పాల్గొన్నారు.
పాఠశాలకు రూ.లక్ష విరాళం
భూత్పూర్, సెప్టెంబర్ 30 : ఎమ్మెల్యే ఆల పుట్టినరోజు సందర్భంగా అన్నాసాగర్, కరివెన గ్రామాల యువకులు అన్నాసాగర్ పాఠశాల అభివృద్ధికి రూ.లక్ష విరాళం అందజేశారు. ఈ సందర్భంగా యువకులను ఎమ్మెల్యే ఆల ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో శ్రీకాంత్‌రెడ్డి, రాజారెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, హెచ్ఎం విద్యావతి తదితరులు పాల్గొన్నారు.