భూత్పూర్, సెప్టెంబర్ 30 : ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆల దంపతులకు రామలింగేశ్వరస్వామి ఆలయంలో అర్చకుడు మంజునాథస్వామి పూర్ణకుంభంతో స్వాగ తం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో మంత్రి నిరంజన్‌రెడ్డి ఎమ్మెల్యే ఆలకు పు ష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు చెప్పారు. కేఎమ్మార్ ఫంక్షన్హాల్లో అభిమానులు, కార్యకర్తల మధ్య ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు.
హైదరాబాద్ మలక్‌పేట యశోద దవాఖాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య, రక్తదాన శిబిరాలను ఎమ్మెల్యే పరిశీలించి రక్తదాతలను అభినందించారు. 200 మంది రక్తదానం చేయగా, వెయ్యి మందికి పైగా వైద్య పరీక్షలను నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, నా యకులు బండారు ప్రకాశ్, బాద్మి శివకుమార్, ఎంపీపీలు హర్షవర్ధన్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, రమాశ్రీకాంత్యాదవ్, జెడ్పీటీసీలు రాజశేఖర్‌రెడ్డి, ఇంద్రయ్యసాగర్, మత్స్య సహకార సంఘం జిల్లా ఇన్చార్జి సత్యనారాయణ, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, జెట్టి నర్సింహారెడ్డి, అశోక్‌రెడ్డి, చంద్రశేఖర్‌గౌడ్, సాయిలు, మురళీధర్‌గౌడ్, నరేశ్‌గౌడ్, సత్యనారాయణ, రామురాథోడ్, అజీజ్, విశ్వేశ్వర్, కొండయ్య పాల్గొన్నారు.