బుధవారం 03 మార్చి 2021
Mahabubnagar - Feb 23, 2021 , 00:39:05

తిమ్మారెడ్డిపల్లి తండాలో ‘పల్లెప్రగతి’పై ఆరా..

తిమ్మారెడ్డిపల్లి తండాలో ‘పల్లెప్రగతి’పై ఆరా..

  • ‘కానరాని ప్రగతి జాడ’ కథనానికి స్పందన
  •  విచారణ చేపట్టిన డీపీవో    
  • అసంపూర్తి పనుల పరిశీలన
  • ‘కానరాని ప్రగతి జాడ’ కథనానికి స్పందన
  • విచారణ చేపట్టిన డీపీవో మురళి

ఊట్కూర్‌, ఫిబ్రవరి 22 : మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండాలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఈ నెల 21న ప్రచురితమైన ‘కానరాని ప్రగతి జాడ’ కథనానికి అధికారులు స్పందించారు. సోమవారం డీపీవో మురళి, ఉపాధి ఏపీడీ సద్గుణ, ఎంపీడీవో కాళప్ప, ఎంపీవో రవికుమార్‌ తండాను సందర్శించారు. తండాకు రెండు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన మంకీఫుడ్‌ కోర్టులో ఎండిపోయిన మొక్కలను పరిశీలించారు. అలాగే గ్రామ శివారులోని చెరువు శిఖం భూమి సర్వే నెంబర్‌ 210, 211లో సెగ్రిగేషన్‌ షెడ్డు, వైకుంఠ ధామం అసంపూర్తి పనులను తనిఖీ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో సమావేశమై ఎస్‌ఎఫ్‌సీ నిధులు, పంచాయతీ నిధుల డ్రా, వినియోగంపై విచారణ జరిపారు. డంపిండ్‌ యార్డు, వైకుంఠధామం నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. మంకీఫుడ్‌ కోర్టులో ఎండిన మొక్కల స్థానంలో కొత్తగా చింత, పండ్ల మొక్కలు నాటాలని, ఫుడ్‌ కోర్టు చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని ఉపాధి ఏపీవో ఎల్లయ్యను ఆదేశించారు. పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు రుజువైతే సర్పంచ్‌, సంబంధిత అధికారులపై నూతన పంచాయతీ చట్టం మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దేవమ్మ, ఉపసర్పంచ్‌ సరోజ, టీఏ హర్షవర్ధన్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo