శనివారం 27 ఫిబ్రవరి 2021
Mahabubnagar - Jan 27, 2021 , 00:16:42

రామ మందిరం నిర్మాణానికి ఎమ్మెల్యే ఆల రూ.2,01,116 విరాళం

రామ మందిరం నిర్మాణానికి ఎమ్మెల్యే ఆల రూ.2,01,116 విరాళం

భూత్పూర్‌, జనవరి 26: అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మంగళవారం మున్సిపల్‌ కేంద్రంలో వీహెచ్‌పీ జిల్లా నాయకులకు రూ.2,01,116ల చెక్కు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ నా వంతు సహకారం అందిస్తున్నానని, ఎవరికి తోచినంత వారు సహకరించాలని కోరారు. మున్సిపాలిటీలో వారం రోజులుగా నిర్వహించిన క్రికెట్‌ టోర్నీ విజేతలకకు ఎమ్మెల్యే ఆల బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ జిల్లా నాయకుడు మద్ది యాదిరెడ్డి, ఎంపీపీ డాక్టర్‌ శేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ సత్తూర్‌ బస్వరాజ్‌గౌడ్‌, బాదేపల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ నారాయణగౌడ్‌, వైస్‌ ఎంపీపీ నరేశ్‌గౌడ్‌, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్‌, సత్యనారాయణ పాల్గొన్నారు.


VIDEOS

logo