ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Mahabubnagar - Jan 27, 2021 , 00:15:26

ప్రగతి పథంలో పాలమూరు

ప్రగతి పథంలో పాలమూరు

  • పరేడ్‌ మైదానంలో జెండావిష్కరణ చేసిన కలెక్టర్‌ వెంకట్రావు

మహబూబ్‌నగర్‌ మెట్టుగడ్డ, జనవరి 26 : ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో.., మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పాలమూరు జిల్లా ప్రగతి పథంలో పయనిస్తుందని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు తెలిపారు. మంగళవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో కలెక్టర్‌ జెండావిష్కరణ చేశారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. పోలీసు కవాతు ఆకట్టుకున్నది. ఆరు సాయుధబలగాలు ముఖ్య అతిథులకు గౌరవందనం సమర్పించాయి. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఉత్తమ సేవలందించిన 21 మందికి పోలీసులకు సేవా పథకాలను కలెక్టర్‌ వెంకట్రావు, ఎస్పీ రెమారాజేశ్వరి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జిల్లాలో జరిగిన ప్రగతిని వివరించారు. 

  • వానకాలంలో రైతుబంధు ద్వారా 1,79,718 మంది ఖాతాల్లో రూ.220.83 కోట్లు, యాసంగిలో 1,83,064 మందికి రూ.220.32 కోట్లు జమచేశామన్నారు. రైతుబీమా ద్వారా ఈ ఏడాది 211 మంది రైతులకు రూ.10.55 కోట్లు చెల్లించామన్నారు. 1,16,688 మంది రైతులకు రూ. 751.82 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. 
  • 2020-21 సంవత్సరానికిగానూ రూ.కోటితో 832 చెరువుల్లో 1.98 కోట్ల చేపపిల్లలు వదిలినట్లు చెప్పారు. 142 నాలుగు చక్రాల వాహనాలను అందజేశామన్నారు. 
  • 7,783 డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా, 7,235 ఇండ్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తిచేశామని, 6,059 ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. ఇందులో 2,485 ఇండ్లు పూర్తి అయ్యాయన్నారు. రూ.198.50 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
  • కొవిడ్‌ బాధితులకు 13 కేఎల్‌ కెపాసిటీతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను, రూ.12 లక్షలతో 250 ఆక్సిజన్‌ బెడ్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఆర్‌టీపీసీఆర్‌ సెంటర్‌ను ఏర్పాటుచేసి 3,242 పరీక్షలు చేశామన్నారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేసిన మూడేండ్లలో 14 పీజీ సీట్లు సాధించినట్లు చెప్పారు. 
  • ఈ ఏడాది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి వచ్చిన 879 దరఖాస్తులలో 738 అనుమతులు ఇచ్చామన్నారు. 63 భారీ, మెగా, మధ్యతరహా పరిశ్రమలను రూ.1,019 కోట్ల పెట్టుబడితో స్థాపించి, 13,170 మందికి ఉపాధి కల్పించినట్లు వివరించారు. 
  • మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో రూ.163 కోట్లతో మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగు నీటిని అందిస్తున్నామన్నారు. 
  • టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రూ.24 కోట్లతో మినీట్యాంక్‌బండ్‌ అభివృద్ధి, రూ.8 కోట్లతో మినీ శిల్పారామం, రూ.10 కోట్లతో కూడళ్ల విస్తరణ, అభివృద్ధి, రూ.25 కోట్లతో ఫుట్‌ఓవర్‌బ్రిడ్జీలు, తోరణాల ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 
  • పట్టణ ప్రగతి కింద 177 పనులకు రూ.155 కోట్లు విడుదల చేయగా 75 శాతం పూర్తయ్యాయన్నారు. కార్యక్రమంలో ఎస్పీ రెమారాజేశ్వరి, ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు తేజస్‌ నందలాల్‌ పవర్‌, సీతారామారావు, డీఆర్వో స్వర్ణలత, జిల్లా న్యాయమూర్తి ప్రేమావతి, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఈవో ఉషారాణి, డీఎఫ్‌వో గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo