వ్యాక్సిన్ ఉత్పత్తి తెలంగాణకే గర్వకారణం

- ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- ఎస్వీఎస్లో 180 మందికి టీకా పంపిణీ
- రెండో విడుత వ్యాక్సినేషన్ షురూ
మహబూబ్‌నగర్ మెట్టగడ్డ, జనవరి 25: కరోనా కట్టడిలో, వ్యాక్సిన్ ఉత్పత్తిలో తెలంగాణ ముందుండటం గర్వంగా ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ దవాఖానలో ప్రైవేట్ దవాఖానల్లో పనిచేసే ఆరోగ్య సిబ్బందికి పంపిణీ చేయనున్న రెండో విడుత వ్యాక్సిన్‌ను ప్రారంభించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కరోనా కట్టడి చేయడంలో ప్రధాని నరేంద్రమోదీతోపాటు సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలు ఆద్భుతమైనవన్నారు. అంతేగాక వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడంలో కూడా ప్రపంచంలో 70శాతం జనాభాకు భారతదేశం నుంచి సరఫరా చేస్తున్నామని, తెలంగాణ నుంచి 40శాతం ఉత్పత్తి చేస్తుండటంతో ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ రంగంలో పనిచేసే ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతి వ్యాప్తించిందని, సంపన్న దేశాల్లో కూడా తెలంగాణపై చర్చ జరగుతున్నదని మంత్రి తెలిపారు. ఎస్వీఎస్ దవాఖానలో 180 మందికి వ్యాక్సిన్ ఇచ్చారని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దశల వారీగా అందరికీ వ్యాక్సిన్ అందిస్తామని తెలిపారు. వ్యాక్సిన్ అందరికీ అందుతుందని ఆందోళన అవసరం లేదని మంత్రి సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ వెంకట్రావు, ఎస్వీఎస్ దవాఖాన అధినేత రాంరెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణ, డీసీసీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎములాడ రాజన్న.. మోదీ మనసు మార్చు
- చంద్రుడిని చుట్టొద్దాం.. దరఖాస్తు చేసుకోండి
- శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- తప్పుకున్న నీరా టండన్.. బైడెన్‌కు చుక్కెదురు
- దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది దుర్మరణం
- శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
- 9 నుంచి ఇంద్రకీలాద్రిపై మహాశివరాత్రి ఉత్సవాలు
- ఇన్నోవేషన్స్ సమాజంపై ప్రభావం చూపాలి : పీయూష్ గోయల్
- స్టాఫ్‌నర్స్ పోస్టులకు వెబ్ ఆప్షన్లు