బుధవారం 03 మార్చి 2021
Mahabubnagar - Jan 25, 2021 , 00:31:53

మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

జడ్చర్ల, జనవరి 24 : రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్థానిక హనుమాన్‌ కాలనీవాసి సత్యం ఆదివా రం చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మృతుడి కు టుంబసభ్యులను పరామర్శించారు. ముందుగా సత్యం పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట హఫీజ్‌, మచ్చల శ్రీను తదితరులు ఉన్నారు.

ఆర్థిక సాయం అందజేత

జడ్చర్లటౌన్‌, జనవరి 24 : మండలంలోని బండమీదిపల్లి గ్రామానికి చెందిన భీమయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రూ.5వేల ఆర్థికసాయం ప్రకటించారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ నాయకులు మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్‌ యాదయ్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొంగలి జంగ య్య, టీఆర్‌ఎస్‌ నాయకులు నాగరాజు, పాండు, చి న్న పెంటయ్య, ఆంజనేయులు, శ్రీను పాల్గొన్నారు. 

VIDEOS

logo